Health

డెంగీని ఎదిరించే ఆహారం ఇది

Food that boost platelet count

ఈ ఆహారం తీసుకుంటే డెంగీ దరిచేరదు
ప్లేట్ లెట్స్ రక్తంలో చాలా ముఖ్యమైనవి. వీటి సంఖ్య తగ్గితే మనిషి ప్రాణాలకే ప్రమాదం. ఏదైనా గాయం అయినప్పుడు గాయం తొందరగా మానేలా ప్లేట్ లెట్స్ ఉపయోగపడుతాయి. వీటి సంఖ్య తగ్గినప్పుడు మనిషికి నీరసం, బీపీ ,జ్వరం వస్తుంది.ప్లేట్ లెట్స్ తగ్గకుండా చూసుకోవాలి. సాధారణంగా మన రక్తంలో 1,50.000 నుండి 4.50.000 వరకు ప్లేట్ లెట్స్ ఉంటాయి.
ప్లేట్ లేట్స్ అధికంగా లభించే ఆహార పదార్థాలు
ముఖ్యంగా బొప్పాయి తీసుకోవడం వల్ల ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది. బ్లడ్ లెవల్ తక్కువగా ఉన్నపుడు బొప్పాయి తీసుకోవాలి.
క్యారెట్ వంటి దుంపలను తీసుకోవడం వల్ల కూడా ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది.కనీసం వారానికి రెండు సార్లైనా వీటిని తీసుకోవాలి.
విటమిన్ కె ఉన్న ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా ప్లేట్ లెట్స్ సంఖ్య పెరుగుతుంది.
మనం తినే ఆహారంలో వెల్లుల్లి వాడటం వల్ల కూడా ప్లేట్ లెట్స్ వస్తాయి.
ప్లేట్ లెట్స్ పెంచడంలో బీట్ రూట్ ఉపయోగపడుతుంది.
దానిమ్మ వంటి ఎర్రగా ఉన్న అన్ని రకాల పళ్లల్లో ఐరన్ ఉంటుంది.ఇది కూడా ప్లేట్ లెట్స్ ను పెంచడానికి ఉపయోగపడుతుంది
ఐరన్ అధికంగా ఉన్నపండ్లలో మరొకటి ఆప్రికాట్ . రోజుకు రెండు సార్లు ఆప్రికాట్ ను తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ పెంచుకోవచ్చు.
రుచికరమైన డ్రై ఫ్రూట్స్ లో 30శాతం ఐరన్ ఉంటుంది. ఒక గుప్పెడు ద్రాక్ష తినడం వల్ల ప్లేట్లెట్ లెవల్స్ ను నేచురల్ గా పెంచుతుంది.
ఖర్జూరలో కూడా ఐరన్స్ తో పాటు న్యూట్రిషియన్స్ అధికంగా ఉంటాయి.