Food

గుమ్మడి-తేనె కలిపి…

Pumpkin Honey Mixture Benefits - Telugu Food News

గుమ్మడికాయ, తేనె మిశ్రమంతో 60ఏళ్ళ మీ వయస్సు 30 ఏళ్ళలా ప్రకాశంతంగా మెరుస్తుంది..

అందంగా కనబడాలనుకోవడం ఒక సవాలే. అందంగా కనబడాలంటే ముఖంలో ఎలాంటి మొటిమలు, మచ్చలు, చారలు, వలయాలు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటికి పరిష్కారంగా మనం చేయగలిగినదంతా చేస్తుంటాము. కానీ కొన్ని సందర్భాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చర్మంలో ఏదో ఒక లోపం ఎత్తి చూపెడుతూనే ఉంటుంది. అందంగా కనబడాలంటే క్రీములు, ఫేషియల్ కు బదులు న్యాచురల్ గా ఉండటానికి ప్రధాన్య ఇవ్వాలి. న్యాచురల్ గా ఉండాలంటే ప్రక్రుతిలో సహజంగా లభించే బ్యూటీ ఉత్పత్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటి సహజ అందాన్ని సహజం మెరుగుపరుచుకోవడానికి యవ్వనంగా కనిపించడానికి గుమ్మడికాయ సహకరిస్తుంది. చర్మ సంరక్షణకు , చర్మ సమస్యలను ప్రభావంతంగా తొలగించి, చర్మంతో కాంతిని నింపడానికి గుమ్మడి ఉపయోగపడుతుంది. అలాగే మరో సహజ బ్యూటీ ప్రొడక్ట్ తేనె. గుమ్మడికాయలో కొద్దిగా తేనె కలపడం వల్ల అందానికి సంబంధించిన ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. చర్మ సౌందర్యానికి మెరుగుపరుచుకోవడానికి గుమ్మడికాయను ఉపయోగించే ముందు, గుమ్మడిలో ఉండే గుణాలేంటి, అవి ఏవిధంగా చర్మ అందాన్ని పెంచుతాయో తెలుసుకోవాలి. అలాగే తేనె చేర్చడం వల్ల ముఖంలో ఏజింగ్ లక్షణాలను తగ్గిస్తుంది, ముడతలను , పొడి చర్మం వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. మరి గుమ్మడికాయను ఎలా ఉపయోగించాలో చూద్దాం. గుమ్మడిలోని న్యూట్రీషియన్లు గుమ్మడి కాయలో విటమిన్ ఎ, సి, ఇలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ చర్మ కణాలను పునరుత్తేజపరుస్తాయి. ఆల్ఫా మరియు బీటా కెరోటీన్ లు శరీరంలో విటమిన్ ఎగా రూపాంతరం చెందుతాయి.

రిటినాయిక్ యాసిడ్: ఇది అద్భుతమై ఎక్స్ఫోయేట్ గా పనిచేస్తుంది. కొల్లాజెన్ చర్మంను యవ్వనంగా మార్చుతుంది. అందుకే దీన్ని స్కిన్ లైటనింగ్ ఏజెంట్ గా పిలుస్తారు. జింక్ మరియు టూరిలిటిన్లు చర్మంలో మొటిమలు నివారించడానికి సహాయడుతాయి. గుమ్మడికాయను డైలీ స్కిన్ కేర్ లో భాగం చేసుకోవడం, స్పా ట్రీట్మెంట్లో సగం బ్యూటీ బెనిఫిట్స్ ఇక్కడే పొందుతారు. గుమ్మడికాయ-తేనె ప్యాక్ తయారుచేసే పద్దతి బాగా పండిన గుమ్మడికాయను కట్ చేసి లోపలి గుజ్జును వేరు చేసి మెత్తగా పేస్ట్ చేయాలి. అందులో కొద్దిగా తేనె కలపవచ్చు. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి, నేరుగా ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత సాధ్యమైనంత మసాజ్ చేయాలి. తర్వాత అరగంట సేపు అలాగే ఉంచాలి. తర్వాత కడిగాలి. ఇలా క్రమం తప్పకుండా మూడు రోజుల పాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి ఈ రెండింటి కలయికలో చర్మ అందం ఎలా పెరుగుతుందో చూదాం. ఏజింగ్ లక్షణాలు తగ్గిస్తుంది చర్మ సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో ఏజింగ్ ఒకటి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ రెమెడీ బాగా ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మంలో చీకాకును తొలగించడంతో పాటు వృద్ధాప్య ఛాయలు కనబడకుండా చేస్తుంది. పొడి చర్మం నివారిస్తుంది చర్మ సమస్యలో మరొకటి డ్రై స్కిన్. ఈ సమస్యకు మంచి పరిష్కారం తేనె మరియు గుమ్మడి మిశ్రమం. ఈ మిశ్ర పేస్ట్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంలో అసౌకర్యం పూర్తిగా తొలగింపబడుతుంది. ఈ మిశ్రమాన్ని రోజూ ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. చర్మ కాంతిని మెరుగుపరుస్తుంది: గుమ్మడి మరియు తేనె మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం ద్వారం చర్మ కాంతి మెరుగుపడుతుంది. అందానికి సవాలుగా మారిన చర్మ రంగును కాంతివంతం చేయడంలో సహాయపడుతుంది. గుమ్మడి తేనె మిశ్రమం స్కిన్ టోన్ ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడుతుంది. చర్మ కాంతి ఏ మాత్రం తగ్గకుండా చర్మానికి రక్షణ కల్పిస్తుంది . ఈ ఫేస్ ను క్రమం తప్పకుండా రోజు వేసుకోవచ్చు. మెడపై నలుపు తగ్గిస్తుంది గుమ్మడికాయ తేనె మిశ్రమం మెడ నల్లబడటానికి ఉత్తమమైన నివారణలలో ఒకటి. ఇది మెడకు అప్లై చేస్తే మెడపై చర్మం నల్లదనాన్ని తొలగించడానికి సహాయపడుతుంది. మెడపై నల్ల మచ్చను పూర్తిగా తొలగించడానికి సహాయపడుతుంది. మెడలోని నల్లదనం సమస్యను శాశ్వతంగా బ్రష్ చేయడం ద్వారా మనం పూర్తిగా తొలగించవచ్చు. కళ్ళు వాపు ముఖంలో అందంగా కనబడేవి కళ్ళు. ఆ కళ్ళు ఉబ్బి, క్యారీబ్యాగుల్లా కనబడుతుంటే వయస్సైన లక్షణాలు స్పష్టంగా కనబడుతాయి. కళ్ళ క్రింద వాపు తగ్గి, కళ్ళు ఆకర్షించాలంటే ఈ మిశ్రమాన్ని కళ్ళ క్రింద అప్లై చేయవచ్చు. ఈ మిశ్రమం కంటికి ఎలాంటి హాని కలిగించదు. కళ్ళు ప్రకాశంతంగా కాంతివంతంగా మార్చుతుంది. కంటి వలయాలు& నలుపు తగ్గిస్తుంది. కంటి క్రింద, కంటి చుట్టూ ఉండే బ్లాక్ సర్కిల్స్ ను తొలగించడానికి గుమ్మడి మరియు తేనె ప్రభావంతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని కంటి చుట్టూ అప్లై చేసి 15నిముషాల తర్వాత కడగాలి. ఇది కంటి చుట్టూ ఉన్న నలుపు తగ్గించి, చర్మం కాంతిని పెంచుతుంది.