DailyDose

నాగార్జున వ్యవసాయ క్షేత్రంలో మృతిదేహాం:నేరవార్తలు-09/19

Rotten Corpse In Nagarjunas Farmhouse-Telugu Crime News-09/19

* పాపిరెడ్డిగూడలో 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగొలు చేసిన సినీ నటుడు అక్కినేని నాగార్జున. వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ పంటలు పండించేందుకు,వ్యవసాయ సాగుపైన నిపుణులను ఆయన కుటుంబ సభ్యులు పంపించారు. పొలంలోని ఒక ప్రాంతంలో వున్న గదిలో కుళ్లిపొయిన మృతిదేహాన్ని గుర్తించిన నిపుణులు.పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతిదేహానికి అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.గది సీజ్ చేసి గురువారం అక్కడే పొస్టు మార్టమ్ నిర్వహించనున్నారు. మృతికి గల కారణాలు,మృతికి గురైన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు
* షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, మాల్స్ లో వినియోగదారుల నుంచి అడ్డంగా పార్కింగ్ వసూళ్లు చేస్తున్నారని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్, తెలంగాణ ఇంచార్జ్ వికాస్ పాండే పేర్కొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను భేఖాతార్ చేస్తూ నిబంధనలను పాటించకుండా వాహనదారులు నుంచి అన్యాయం గా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారని చెప్పారు.
* రాజుపాలెం మండ‌లం గాదెగూడూరుకు చెందిన ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.ఒకే కుటుంబంలోని ముగ్గురు కూలూరు వ‌ద్ద ఉన్న కుందూ న‌దిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. గాదెగూడూరుకు చెందిన భార్యభర్తలు తిరుప‌తి రెడ్డి, వెంక‌ట‌ల‌క్ష్మి… వారి కుమార్తె ప్రవల్లిక ఇవాళ తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదంటూ తిరుపతిరెడ్డి అల్లుడు సుధీర్‌కుమార్‌రెడ్డి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్రవల్లిక విషయంలో కొన్ని రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వారు నదిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని బంధువులు అనుమానిస్తున్నారు
* ప్రకాశం జిల్లాల్లో ఒక స్కూల్‌ బస్సు అదుపు తప్పి పంట కాల్వలోకి దూసుకెళ్లి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొంతమంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
* విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణం రెడ్డికె వీధిలో గురువారం వేకువజామున బాణాసంచా పేలిన ఘటనలో మూడు ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. మరికొన్ని గృహాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అదే వీధికి చెందిన జి.శ్రీనివాసరావు తన ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన జిలిటెన్‌స్టిక్స్‌ ప్రమాదవశాత్తు పేలాయి. ఈ ఘటనలో శ్రీనివాసరావు ఇంటితో పాటు పరిసరాల్లో ఉన్న జి.రమేశ్‌, సతీశ్‌ ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. ఆ శబ్దానికి స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు.
* ముగ్గురు అక్కచెల్లెళ్లను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన పోలీసులు వారిని వివస్త్రలను చేసి విపరీతంగా కొట్టారు. ఆ ముగ్గురిలో ఒకరు గర్భిణి అనే విషయాన్ని కూడా పట్టించుకోని పోలీసుల దురహంకారంతో ఆమెకు గర్భస్రావమయింది. కఠినాత్ములను సైతం కదిలించే ఈ ఘటన దర్రాంగ్‌ జిల్లాలోని సిపాఝార్‌ పోలీసు స్టేషన్‌లో జరిగింది. ఈ దారుణానికి ఒడిగట్టిన పోలీసుల్లో ఓ మహిళా కానిస్టేబుల్‌ ఉండటం మరింత బాధకలిగించే విషయం. కనీసమానవత్వం లేకుండా వ్యవహరించిన పోలీసు అధికారిని, మహిళా కానిస్టేబుల్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది.
* గోంగూర తిప్పలంక లో కుళ్ళిన వ్యక్తి మృతదేహం కనిపించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లి ఇసుక ర్యాంపు ఎదురుగా గోదావరి మధ్య ఉన్న గోంగూర తిప్పలంక లో గుర్తు తెలియని కుళ్ళిన పురుషుని మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు ఉండవచ్చునని పోలీసులు భావించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
* గోదావరి నదిలో కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన రాయల్‌ వశిష్ట బోటు యజమాని కోడిగుడ్ల వెంకటరమణపై గతంలోనూ అనేక కేసులున్న విషయం వెలుగుచూసింది. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణ తొలి నుంచీ వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండేవాడు. ముఖ్యంగా స్వగ్రామంలో భూ దందాలకు సంబంధించి 2009 నుంచి 2017 వరకు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. 2012 నుంచి రాజమండ్రిలో బోటు ద్వారా జలరవాణా వ్యాపారంలోకి అడుగు పెట్టిన వెంకటరమణ కొద్దిరోజులకే కుటుంబంతో సహా అక్కడికి మకాం మార్చాడు. గోదావరి నదిలో కేవీఆర్‌ ట్రావెల్స్‌ పేరుతో రెండు లాంచీలు నడుపుతున్నాడు. అయితే రెండింటికీ ప్రభుత్వ శాఖల తరపున ఎలాంటి అనుమతులూ లేవు.
* తూర్పుగోదావరి జిల్లాలోని కచ్చులూరు మందంలోకి పడిపోయిన పర్యాటక బోటు ఆచూకీ లభ్యమైంది. ఈ బోటును బయటకు తీస్తే అది సంచలనమే.. ఈ బోటును బయటకు తీసే ప్రయత్నాల్లో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులను చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. గోదావరిలో 214 అడుగుల లోతులో బోటు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సోనార్ వ్యవస్థ ద్వారా ఈ బోటు ఆచూకీ కనుగొనడం సాధ్యమైంది.
* దేశ రాజధాని ఢిల్లీలో కనిపించకుండా పోయిన ఏనుగు లక్ష్మి ఆచూకిని అటవీశాఖ అధికారులు 2 నెలల తరువాత కనుగొన్నారు. లక్ష్మిని దాచిపెట్టిన మావటిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఏనుగు, మావటి ఎక్కడున్నది ఆచూకి తీసి అటవీశాఖ అధికారులకు తెలియజేసినట్లు తూర్పు ఢిల్లీ డీసీపీ జస్మీత్‌ సింగ్‌ చెప్పారు. తూర్పు ఢిల్లీలోని చిల్లా గ్రామం దగ్గరనున్న యమునా ఖాదర్‌ ప్రాంతంలో ఏనుగును, మావటిని కనుగొన్నారు. ఏనుగు కేర్‌టేకర్‌ యూసఫ్‌ అలీ, అతని కుమారుడు షకీర్‌ ఇంకా పోలీసులకు చిక్కలేదు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఏనుగుని తీసుకుని పారిపోయిన ముగ్గురిపై షాకుర్‌పుర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఏనుగు లక్ష్మి జూనోటిక్‌ వైరల్‌ వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం