Movies

నాకు చెప్పు

Sanjay Dutt Sharukh Khan Story

తనదైన నటనతో ప్రేక్షకులను అలరించిన నటుడు సంజయ్‌దత్‌. నటుడిగా ఉన్నత శిఖరాలను అందుకున్న ఆయన, అదే సమయంలో పతనావస్థను చూశారు. జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం మళ్లీ సరికొత్తగా జీవిస్తూ వరుస సినిమాలో బిజీగా ఉన్నారు ఇతర విషయాల్లో ఎలా ఉన్నప్పటికీ స్నేహితుల విషయంలో మాత్రం ఏం చేయడానికైనా వెనుకాడని వ్యక్తి సంజయ్. ఆపదలో ఉన్న స్నేహితులను ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారు. అలా ఓసారి బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్‌కు సమస్య వస్తే సంజయ్‌ ఆయనకు అండగా నిలిచారు. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమా విడుదల సమయంలో షారుక్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో సంజయ్‌ పాల్గొన్నారు. ఆ షోలో సంజయ్‌ తనకు ఎంత సాయం చేశారో షారుక్‌ వెల్లడించారు. అవి షారుక్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలిరోజులు. షారుక్‌ సినిమాల నిమిత్తం దిల్లీ నుంచి ముంబయి వచ్చారు. దాంతో ఆయనకు ముంబయిలో తెలిసినవారెవ్వరూ లేరు. ఓసారి షారుక్‌కు ఓ వ్యక్తితో పెద్ద గొడవైంది. దాంతో తన కెరీర్‌ పాడవుతుందేమోనని షారుక్‌ చాలా భయపడ్డారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మౌనంగా ఉండేవారు. అదే సమయంలో షారుక్‌ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ‘నీ మీద ఎవరైనా చెయ్యి వేస్తే నాతో చెప్పు’ అని ధైర్యం చెప్పారు. ఆ వ్యక్తి ఎవరో కాదు సంజయ్‌ దత్‌. ఈ విషయాన్ని షారుక్‌ వెల్లడిస్తూ..‘ఈ ఒక్క విషయంలో మీకు ఎప్పటికీ రుణ పడి ఉంటాను సంజు బాబా’ అన్నారు.