DailyDose

కోలుకున్న స్టాక్ మార్కెట్లు:వాణిజ్యం-09/19

Stock Markets Gain Strength-Telugu Business News-09/19

* దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.సెన్సెక్స్‌ 89 పాయింట్లు లాభపడి 36,653 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 12 పాయింట్లు లాభపడి 10,853 వద్ద కొనసాగుతోంది.
* టీవీ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానికి తయారీని మరింత ప్రోత్సాహించేందుకు ఎల్ఈడీ టీవీ ప్యానెళ్ళ (తెర) తయారీలో వాడే ఓపెన్ సెల్ పై ప్రస్తుతం వసూలు చేస్తున్న 5 శాతం దిగుమతి సుంకాన్ని ప్రభుత్వం రద్దు చేయడమే ఇందుకు కారణం. ఇందు వాళ్ళ టీవీ ధరలు దాదాపు 3-4 శాతం తగ్గోచ్చని పానసోనిక్ పేర్కొంది
* ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) కు ఫోర్బ్స్ ఉత్తమ బిజినెస్ స్కూళ్ల జాబితా 2019లో అంతజాతీయంగా ఎదో స్థానం దక్కింది. ఈ సర్వే లో తొలిసారిగా పాల్గొన్న ఐఎస్బీ ఆసియాలో మొదటి స్థానంలో నిలిచింది
* రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ ఐ ఎల్) ప్రమోటర్ అయిన ముకేశ్ అంబానీ, సంస్థలో తన వాటాను స్వల్పంగా పెంచుకున్నారు. ప్రమోటర్ గ్రూపు సంస్థ పెట్రోలియం ట్రస్టు నియంత్రణలో ఉన్న రిలయన్స్ సర్వీస్ అండ్ హోల్డింగ్స్ ద్వారా 17.18 కోట్ల షేర్లను (2.71 శాతం) ఈ నెల 13న కొనుగోలు చేసినట్లు ఎక్స్చేజీలకు కంపెనీ సమాచారం ఇచ్చింది. రిలయన్స్ తో నేరుగా సంబంధం లేకుండా ఈ కొనుగోలు ప్రక్రియ జరిగినట్లు తెలుస్తోంది
* రేపటి వస్తు సేవల పన్ను(జీ ఎస్ టీ) మండలి సమావేశంలో బిస్కెట్లు, వాహన కంపెనీలకు ఊరట లభించకపోవచ్చు. బిస్కెట్లు, వాహనాలపై ‘జీ ఎస్ టీ’ రెట్లు తగ్గించాలనే డిమాండ్లను కమిటీ తిరస్కరించింది.వీటిపై ‘జీ ఎస్ టీ’ రేటు తగ్గిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని కమిటీ పేర్కొంది
* దక్షిణ ఆఫ్రీకాలోని ఆస్పెన్ ఫార్మాకేర్ కు అనుబంధ సంస్థ అయిన ఫెకోలాంగ్ ఫార్మాసూటికల్స్ పీటీవై లిమిటెడ్ ను హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు సాగిస్తున్న లారస్ ల్యాబ్స్ కొనుగోలు చేయనుంది
* కంపెనీలకు క్లౌడ్ డేటా నిర్వహణ సేవలు అందించే ఇన్‌ఫర్మాటికా హైదరాబాదులోని అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించింది. దేశంలో ఐఓసి, ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి ప్రముఖ సంస్థలకు క్లౌడ్ డేటా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు
* ప్రయాణీకుల సంఖ్యా పరంగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విమానాశ్రయాల్లో మూడోస్థానం జీ ఎం ఆర్ గ్రూపు నిర్వహిస్తున్న హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి దక్కింది
* కనీసం రూ.500 సగటు నిల్వ కొనసాగించే ఖాతాదారులకు రూ. 5 లక్షల ప్రమాద బీమా అందించే పొడుపు ఖాతా ‘భరోసా సేవింగ్స్ అకౌంట్’ ను ఎయిర్టెల్ పెమేన్త్స్ బ్యాక్ ఆవిష్కరించింది. ప్రతినెల ఈ ఖాతా నుంచి ఒక చెల్లింపు అయిన జరపాల్సి ఉంటుందని సంస్థ పేర్కొంది
* అలహాబాద్ బ్యాంక్ ను విలీనం చేసుకోడానికి ఇండియన్ బ్యాంక్ బోర్డు సూత్రంప్రాయ ఆమోదం తెలిపింది
* బొగ్గు తవ్వకం, కాంట్రాక్టు పద్ధతిలో తయారీ, ఏక బ్రాండు వర్తక రంగాల్లో ఎఫ్ డీ ఐ నిబంధనల సదలిపు, డిజిటల్ మీడియాలో 26% ఎఫ్ డీ ఐ అనుమతి నిర్ణయాలను పరిశ్రమల ప్రోత్సాహం, అంతర్గత వాణిజ్య విభాగం నోటిఫై చేసింది
* జులైలో రిలయన్స్ జియోకు 85.39 లక్షల కొత్త కనెక్షన్లు జత చేరడంతో , వినియోగదారుల సంఖ్య 33.97 కోట్లకు చేరింది
* నేటి డాలరు ధర రూ.71.33
* నేటి బంగారం 10గ్రాముల ధర రూ.38,745
* నేటి వెండి కిలో ధర రూ.48,765