Fashion

కొత్తబట్టలు ఉతికి వేసుకుంటే ర్యాష్‌లు దరిచేరవు

Wash New Clothes Before Wearing - It Avoids Health Problems

కొత్త డ్రెస్సు కొనగానే ఒక మురిపెం. ఎప్పుడెప్పుడు వేసుకుందామా? అనే ఆరాటం ఎక్కువ మందికి ఉంటుంది. అయితే ఆ బట్టలతో ఆరోగ్యం ఖరాబయ్యే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొత్త బట్టలతో స్కిన్‌‌ అలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అయితే అందుకు కారణం వాటిపై పేరుకుపోయే దుమ్ము లేదంటే కెమికల్స్‌‌ కాదంటున్నారు డాక్టర్లు. మరేంటంటారా?. కొత్త బట్టలకు ఉండే రంగులతో స్కిన్‌‌ అలర్జీలు వస్తాయని డాక్టర్‌‌ సుసాన్‌‌ నెడోరోస్ట్‌‌ చెబుతోంది. ‘డెర్మటాలజిస్టుల దగ్గరికి వచ్చే కేసుల్లో మెడ, మోచేతి కింది భాగం, చంక దగ్గర భాగంలో ర్యాష్‌‌లతో వచ్చేవాళ్లు ఉంటారు. వీళ్లలో 80 శాతం కేసులు కొత్త బట్టల వల్ల అలర్జీ బారినపడేవే. అందుకే కొత్త డ్రెస్సుల్ని ఒకసారి వాష్‌‌ చేశాక, వేసుకోవడం మంచిది’ అని అంటోంది ఆమె. కొత్త బట్టల రంగుల్లో కెమికల్స్‌‌ పర్సంటేజ్‌‌ ఎక్కువగా ఉంటుంది. ఇవి నేరుగా చర్మంపై ప్రభావం చూపిస్తాయి. అదే ఒకసారి వాష్‌‌ చేస్తే ఆ ప్రభావం తక్కువగా ఉంటుంది. అంతేకాదు ఉతికి వేసుకోవడం వల్ల కొత్తగా అలర్జీలు వచ్చే అవకాశం కూడా ఉండదని సుసాన్‌‌ వివరిస్తోంది.