Videos

ఆనంద్‌ను అంతర్జాలాన్ని కదిలించిన పాపాయి

Anand Mahindra's Video Of A Little Girls Moves The Internet

ఆసక్తికర, హాస్యాస్పద, మానవీయ కథనాలను పోస్టు చేస్తూ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రాను ఓ చిన్నారి వీడియో కంటతడి పెట్టించింది. నిండా మూడేళ్లు కూడా ఉంటాయో లేదో పాపం పుట్టకతోనే చేతులు లేకుండా చేశాడా భగవంతుడు. అయినా నేను ఎందులోనూ తక్కువ కాదంటూ కాళ్లతోనే అన్ని పనులు చేసుకుంటున్నాడా చిన్నారి. చేతుల్లేకపోయినా పాదాలతో తింటున్న ఆ చిన్నారి వీడియోను చూసి ఆనంద్‌ మహీంద్రా కన్నీళ్లు ఆపుకోలేకపోయారట. తన ట్విటర్ ఖాతాలో ఆ వీడియో షేర్‌ చేస్తూ.. ‘ఈ మధ్యే నా మనవడ్ని చూసొచ్చా. అందుకే వాట్సాప్‌ పోస్టులో ఈ వీడియో చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయా. ఎలాంటి లోపాలు, సవాళ్లు ఉన్నాసరే.. జీవితం మనకో బహుమతి. దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత మనదే. ఇలాంటి వీడియోలు చూసినప్పుడ్డు నాలో ఆత్మవిశ్వాసం, ఆశావహ దృక్పథం మరింత పెరుగుతుంది’ అని ఆనంద్ మహీంద్రా ఉద్వేగంగా చెప్పుకొచ్చారు. ఈ వీడియోలో చిన్నారి మొదట పాదాలతో తినలేకపోయాడు. అయినప్పటికీ ఆగిపోకుండా మరోసారి ప్రయత్నించి విజయం సాధించాడు. ఈ వీడియో ఆనంద్‌ మహీంద్రానే కాదు ఎంతోమంది నెటిజన్ల హృదయాలను కదలించింది. ఆ చిన్నారి జీవితం బాగుండాలంటూ నెటిజన్లు దీవిస్తున్నారు.