Movies

లైలా…బాల

Balakrishna Meets Laila

టాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ, అలనాటి తార లైలా కలిసి నటించిన చిత్రం ‘పవిత్ర ప్రేమ’. 1998లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ జంట మరోసారి కలిశారు. సినిమా కోసం అనుకుంటున్నారా..? కాదండీ..! వీరు ఎయిర్‌పోర్ట్‌ వద్ద అనుకోకుండా కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలో బాలయ్య, లైలాతోపాటు నటి సోనాల్‌ చౌహాన్‌ కూడా ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య తన 105వ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికలు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బాలయ్య యంగ్‌ లుక్‌లో కనిపించి అందర్నీ ఆశ్యర్యానికి గురి చేశారు.