ScienceAndTech

విక్రం మీద ఆశలు వదులుకున్నాం. ఇక గగనయాన్‌పై దృష్టి.

ISRO Chief Shivan Speaks Of Vikram And Gaganayan

ఇస్రో చీఫ్ కే శివ‌న్ ఇవాళ మీడియాతో మాట్లాడారు.

చంద్ర‌యాన్‌2లోని ఆర్బిటార్ అద్భుతంగా ప‌నిచేస్తుంద‌ని తెలిపారు.

ఆర్బిటార్‌లో మొత్తం 8 ప‌రిక‌రాలు ఉన్నాయ‌ని, ప్ర‌తి ప‌రిక‌రం మెరుగ్గా ప‌నిచేస్తున్నాయ‌న్నారు.

అయితే విక్ర‌మ్ ల్యాండ‌ర్‌తో మాత్రం ఇంకా సంకేతాల‌ను అందుకోలేక‌పోయామ‌ని చెప్పారు.

ఇక త‌మ త‌దుప‌రి ల‌క్ష్యం గ‌గ‌న్‌యాన్ అని శివ‌న్ వెల్ల‌డించారు.

ఇప్ప‌టికే గ‌గ‌న్‌యాన్ కోసం వ్యోమ‌గాముల ఎంపిక జ‌రిగింది.

వారికి శారీర‌క శిక్ష‌ణ‌లు కూడా ఇస్తున్నారు.

చివ‌రగా న‌లుగురు వ్యోమ‌గాముల‌కు ర‌ష్యాలోని స్పేస్ సెంట‌ర్‌లో ట్రైనింగ్ ఇవ్వ‌నున్నారు.