NRI-NRT

డల్లాస్ ప్రవాసులను అలరించిన టాంటెక్స్ వీణా విభావరి

TANTEX 2019 Veena Musical Evening Enthralls Telugu NRIs | Dallas Telugu News

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో St. Malankakaara Orthodox Church Auditoriumలో ఏర్పాటు చేసిన “ఫణినారాయణ వీణా మహతీ స్రవంతి” కార్యక్రమం ప్రవాసులను అలరించింది. అధ్యక్షులు చినసత్యం వీర్నపు స్వాగతం పలికి సంస్థ కార్యక్రమాలను సభకు వివరించారు. జయ కళ్యాణి వ్యాఖ్యాత్రిగా వ్యవహరించి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫణినారాయణని సభకు పరిచయం చేశారు. అనంతరం విధ్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాస్ ఇయ్యున్ని, చినసత్యం వీర్నపులు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు. స్వాతి కృష్ణమూర్తి శిష్య బృందం ఆలపించిన కృష్ణాష్టకం గీతంతో ప్రారంభం అయ్యింది. సాయితన్మయి మరియు వారి మిత్ర బృందం పాడిన శాస్త్రీయ గీతాలు అందరిని అలరించాయి. ఫణినారయణ ప్రార్ధనా గీతం వీణపై వాయించి కార్యక్రమం మొదలుపెట్టారు. “వటపత్ర సాయికి వరహాల లాలి..”, “కధగా కల్పనగా కనిపించెను నాకొక యువరాణీ..”, “పరువం వానగా …”, “శుభలేఖ రాసుకున్న…”, “తకిట తకిట తందాన…”, “సామజ వరగమన…”, “ఈగాలి ఈనేల…” వంటి పాటలతో 3గంటల పాటు అతిథులను మంత్రముగ్థులను చేశారు. ఫణినారాయణ వీణా వడలిని, విధ్వాన్ శంకర్ రాజ గోపాలన్, సతీష్ నటరాజన్, శ్రీనివాస్ ఇయ్యున్ని టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, శరత్ యర్రం కళ్యాణి తాడిమేటి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. రఘురాం బుర్ర, బాల గనపవరపు, జయ కళ్యాణి, పూజిత కడిమిశెట్టి, టాంటెక్స్ పూర్వాధ్యక్షులు సుబ్రమణ్యం జొన్నలగడ్డ, డా. తోటకూర ప్రసాద్, శ్రీకాంత్ పోలవరపు, అనంత్ మల్లవరపు, డా. రమణ జువ్వాడి, చంద్రహాస్ మద్దుకూరి తదితరులు పాల్గొన్నారు.