DailyDose

చంద్రబాబు ఇల్లు కూలుస్తారా:తాజావార్తలు-09/21

Will Jagans Govt Demolish CBNs House-Telugu Breaking News-09/21

* ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చంద్రబాబు ఇల్లు కూల్చివేతపై ఉత్కంట నెలకొంది. ఇంటి యజమాని లింగమనేని రమేష్ తనకు అన్ని అనుమతులు ఉన్నాయని, ప్రభుత్వానికి కౌంటర్ ఇచ్చారు. రమేష్ కోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం
* విజయవాడ అరండల్ పేటలో మంగి శెట్టి మనోజ్ అనే యువకున్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో దాడి చేసి చంపివేయడం కలకలం సృష్టించింది
* గతంలో వైఎస్ చిత్తూరు జిల్లలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ మృతిచెందారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్ అక్టోబర్ 2న అక్కడి నుండే రచ్చబండను ప్రారంబిస్తున్నాడు
* ప్రజలు ఎదో ఒక భాషను బలవంతంగా నేర్చుకోమని వారిపై రుద్దడం సరికాదని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అభిప్రాయం వ్యక్తపరిచారు
* మద్రాస్ హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వీకే తహిల్ రమణి ఇచ్చిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు
* దాదా సాహెబ్ ప్ఫాల్కే అవార్డును సూపర్ స్టార్ మహేష్ బాబు అందుకున్నారు
* ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ తీసే సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు
* అగస్టా హెలీకాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తిగా భావిస్తున్న మైఖేల్ ను సీబీఐ విచారించనుంది
* ఎంపీ రేవంత్ రెడ్డీ చేసిన వ్యాఖ్యలను తెలంగాణా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డీ తప్పు పట్టారు
* నేటి మార్కెట్ లో బంగారం ధర రూ.2000 తగ్గింది
* సిబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో విందు సమావేశం నిర్వహించడం సంచలనం కలిగించింది
* మళ్ళీ ‘పుల్వామా’ లాంటి దాడి జరిగితేనే ఎన్నికల్లో భాజాపా గెలుస్తుందని ఎన్సీపీ నేత శరద్ పవార్ ఘాటుగా విమర్శించారు
* చిత్తూరు పార్లమెంట్ మాజీ సభ్యుడు శివప్రసాద్ మృతిచెందడం పట్ల సిఎం, చంద్రబాబుతో సహా పలువురు నేతలు సంతాపం వ్యక్తపరిచారు.