Politics

హ్యూస్టన్‌లో హౌడీ మోడీ విజయవంతం

హ్యూస్టన్‌లో హౌడీ మోడీ విజయవంతం

హ్యూస్టన్‌ ఉర్రూతలూగింది! ‘హౌడీ మోదీ’ నినాదాలతో హోరెత్తింది. ఆనందోత్సాహాలతో తీన్‌మార్‌ ఆడింది!

కార్యక్రమానికి హాజరైన అభిమానుల సంరంభం అంతా ఇంతాకాదు! సభ జరుగుతోంది భారత్‌లోనేమో అన్నట్లుగా ప్రజల చప్పట్లు, నినాదాలు మార్మోగాయి.

‘గుడ్‌మార్నింగ్‌ హ్యూస్టన్‌.. గుడ్‌మార్నింగ్‌ అమెరికా’ అంటూ మోదీ ప్రసంగాన్ని మొదలు పెట్టగానే 50వేల మంది హాజరైన ఎన్‌ఆర్‌జీ స్టేడియం చప్పట్లు, నినాదాలతో దద్దరిల్లింది.

అది లగాయతు కొన్ని నిమిషాల పాటు అదే హోరు కొనసాగింది.

అధ్యక్షుడు ట్రంప్‌తో కలిసి వేదికపైకి వచ్చిన మోదీ ఆంగ్లంలో ప్రారంభోపన్యాసం చేశారు. ఆ తర్వాత ట్రంప్‌ మాట్లాడారు.

అమెరికా-భారత్‌ మధ్య స్నేహం ప్రాధాన్యాన్ని ట్రంప్‌ చెబుతున్నప్పుడూ ప్రజలు హర్షధ్వానాలు చేశారు.

అనంతరం మోదీ హిందీలో సుదీర్ఘంగా ప్రసంగించారు.

పాకిస్థాన్‌ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఆ దేశం తీరును మోదీ ఎండగడుతున్నప్పుడు అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు.

అంతకుముందు మోదీకి హ్యూస్టర్‌ మేయర్‌ సిల్విస్టర్‌ టర్నర్‌ స్వాగతం పలికారు.

‘హౌదీ మోదీ’ కార్యక్రమం ప్రాధాన్యాన్ని వివరిస్తూ హ్యూస్టన్‌ నగర అభివృద్ధిలో భారతీయుల కృషి ఎనలేనిదని కొనియాడారు.

ఇక్కడి ప్రజలంతా హౌడీ మోదీ అనడం హ్యూస్టన్‌కు అత్యంత గౌరవప్రదమైన విషయమని అభివర్ణించారు.