Movies

16 ఏళ్ల దోస్తీ

Katrina speaks about salman khan and their friendship

బాలీవుడ్‌ సల్లూభాయ్‌ సల్మాన్‌ ఖాన్‌తో తనది 16 ఏళ్ల స్నేహబంధమని బార్బీగర్ల్‌ కత్రినా కైఫ్‌ అన్నారు. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, ఆ తర్వాత విడిపోయారని రకరకాల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీని గురించి కత్రినాను మీడియా తాజాగా ప్రశ్నించింది. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మాది 16 ఏళ్ల నిజమైన స్నేహబంధం. సల్మాన్‌ చాలా దృఢమైన వ్యక్తి. ఆపదలు, అవసరాలు వచ్చినప్పుడు తోడుండే నేస్తం. అతడు తరచూ టచ్‌లో ఉండకపోవచ్చు. కానీ తన స్నేహితులకు అండగా మాత్రం ఎప్పుడూ ఉంటాడు’ అని మెచ్చుకున్నారు.