DailyDose

అజ్మీర్‌లో ఘోరప్రమాదం-11 మంది మృతి:నేరవార్తలు-09/22

Telugu Crime News Today - Sep 22 2019

* అజ్మేర్​లో ఘోర ప్రమాదం జరిగింది. మాంగళ్యావాస్ లవానా హైవేపై ట్రక్కు-బస్సు ఢీకొన్న ఘటనలో 11 మంది మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. మాంగల్యావాస్, బ్యావర్ మధ్య ఈ దుర్ఘటన జరిగింది. ఐదుగురు ప్రయాణికులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
* పెదకాకాని వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇస్రాయిల్ పేటకి చెందిన మస్తాన్ వలి కి చికిత్స చేస్తున్న తాడికొండ ంళా డ్ర్. వుండవల్లి శ్రీదేవి
* పడవ ప్రమాదానికి సంబంధించిమ, మరో మృత దేహం లభ్యమైంది. సింగనపల్లి వద్ద మృతదేహాన్ని గుర్తించిన సహాయ సిబ్బంది ఒడ్డుకు చేర్చారు. తాజా ఘటనతో ఇప్పటివరకూ 37 మృతదేహాలు లభ్యమైనట్టైంది. మరో 14 మంది ఆచూకీ తేలాల్సి ఉంది. 26 మంది క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబీకులు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు
* బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక సమాచారం మేరకు అరకు కు చెందిన త్రినాధ్ అనే యువకుడు శనివారం రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో తన స్నేహితుడు తో కలిసి చీరాల వైపునకు బైకుపై వెళ్తుండగా బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల సమీపానికి వచ్చే సరికి ఎదురుగ వస్తున్న కారు ఒక్కసారిగా ఢీ కొనడంతో బైకు పై ఉన్న త్రినాధ్ తీవ్ర గాయాలయాలతో క్రింద పడిపోయాడు. దీంతో వెంటనే కారు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన త్రినాద్ ను బాపట్ల ఏరియా వైద్యశాలకు తీసుకువచ్చి వెంటనే అక్కడనుంచి జారుకున్నాడు. తీవ్రంగా గాయపడిన త్రినాధ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. మృతుడు త్రినాధ్ రాయల్ మెరైన్ కంపెనీలో పని చేస్తున్నట్లు సమాచారం. మృతుడికి శవపంచనామా నిర్వహించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై సంధ్యా రాణి తెలిపారు.
* సక్రజిత్ భన్జిఒ, భార్య, ఒక పాపతో నాలుగున్నర సంవత్సరాల నుండి జాహ్నవి ఎన్క్లేవ్ లో నివాసం ఉంటున్నాడు ఇతను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కాన్వెంట్ జంక్షన్ వద్ద పని చేస్తున్నాడు, సొంత ఊరు రూర్కెల ఒరిస్సా. నిన్న సాయంత్రం 5 గంటలకు రూర్కెలలో ఉన్న వాళ్ళ అమ్మ గారికి ఫోన్ చేసి కోడలిని మనవరాలిని చంపి ఫ్లాట్ లో ఉంచాను వెళ్లి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి తాను కూడా రైలు కిందపడి చనిపోయాడు. విశాఖపట్నం ఉన్న తన ఫ్రెండ్ సహాయంతో వాళ్ళ అమ్మగారు స్టేషన్ పీఎం పాలెం కు తెలియజేసిసారు. పీఎం పాలెం సిఐ గారు మరియు ఎస్సై శ్రీనివాస్ గారు తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా వంట గదిలో భార్య బాత్రూంలో పాప చనిపోయి ఉన్నారు
* సుమారు 1600 కేజీల మాదక ద్రవ్యాలను తీసుకెళుతున్న మయాన్మార్‌ నౌకను కార్‌ నిరోబార్‌ ద్వీపం సమీపాన భారత కోస్ట్‌ గార్డ్‌(ఐసిజి) పట్టుకుంది. దీనిని కెటామైన్‌ అనే మాదక ద్రవ్యంగా గుర్తించింది. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌ 300 కోట్ల రూపాయలని అంచనా. ఈ విషయాన్ని అధికారులకు చేరవేసింది.
* నలుగురు సాయుధ దుండగులు కలకలం సృష్టించారు. ఈ ఉదయం ఓ వాహనంలో వచ్చి అక్షరధామ్​ ఆలయం వద్ద పోలీసులపై కాల్పులు జరిపారు. తనిఖీల కోసం వాహనం ఆపాలని సూచించగా దాడికి తెగబడి, పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని చెప్పారు.