Movies

అంత ఖర్చు ఎందుకు బుజ్జి?

Balakrishna Squeezes Boyapatis Budget

లాస్ట్ ఇయర్ జై సింహాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య తరువాత భారీ బడ్జట్ తో తానె స్వయంగా నిర్మాతగా మారి స్వర్గీయ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్రను రెండు భాగాలుగా తెరకేక్కించగా, రెండు పార్టులు ఫ్లాప్స్ అయ్యాయి. పాజిటివ్ టాక్ వచ్చినా రెండూ అంతటి ఫ్లాప్ గా మారడానికి కారణాలు ఏంటో ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టలేదు. ఇక బాలయ్య ఆ ఫ్లాపులను మరిచి వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్న విషయం తెలిసిందే. ముందుగా కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో తన కొత్త సినిమా మొదలుపెట్టిన బాలయ్యా, రీసెంట్ గా బోయపాటి శ్రీనుతో మరో కొత్త సినిమాకు కమిట్ అయ్యారు. రీసెంట్ గా బోయపాటి ‘వినయ విధేయ రామా’ తో పెద్ద ఫ్లాప్ అందుకోడంతో తక్కువ బడ్జట్ తో తీసి మంచి కంబ్యాక్ ఇస్తాడని అందరూ భావిస్తుండగా….ఇన్సైడ్ న్యూస్ ప్రకారం బాలయ్య సినిమా నిర్మాతతో సినిమా బడ్జట్ ఏకంగా 50 నుండి 60 కోట్లు అవుతుందని చెప్పాడట. దాంతో నిర్మాత బాలయ్యని కలవగా బాలయ్య బోయపాటిని పిలిచి ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్నా అంత బడ్జట్ అయితే సేఫ్ కాదని చెబుతూ, సినిమాను 25 నుండి 30 కోట్ల లోపే పూర్తి చేయాల్సి ఉంటుందని స్ట్రాంగ్ గా చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.