Movies

ఆఫర్లు లేవు

Devisri Prasad Loses Chances To Bollywood Directors

టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కష్టాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఒకప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేసిన దేవిశ్రీ తన ఫాం కోల్పోవడంతో అతడికి అవకాశాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ , త్రివిక్రమ్ ల మూవీ పోగొట్టుకున్న దేవిశ్రీకి మరోసారి ఊహించని దెబ్బ తగిలినట్లుగా వార్తలు వస్తున్నాయి. కొరటాల శివ కూడా దేవీని పక్కకు పెట్టినట్లు సమాచారం. కొరటాల ఇప్పటి వరకూ దర్శకత్వం వహిస్తున్న అన్ని సినిమాలకు దేవీనే మ్యూజిక్ ఇచ్చాడు. ఐతే ఇప్పుడు దేవీశ్రీని కొరటాల, చిరజీవితో తవరలో మొదలు పెట్టబోయే సినిమా విషయంలో పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ను తీసుకొని రావాలని కొరటాల ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం దేవీశ్రీకి మహేష్ బాబు నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ తప్ప మరి ఎ పెద్ద సినిమాలు చేతిలో లేవు. ఆ మూవీ ఆడియోను హిట్ చేయలేకపోతే దేవీశ్రీకు కష్ట కాలమే అంటున్నారు. అయితే ఒక సారి ట్రాక్ లోకి వస్తే దేవీశ్రీను అందుకోవడం ఎవరి వల్లా కాదని, సాధారణంగా ఇండస్ట్రీలోని దర్శకులకు, సంగీత దర్శకులకు ఇలాంటి పరిస్థితి వస్తూనే ఉంటుందని దేవీశ్రీ సన్నిహితులు అంటున్నారు.