ఈ నెల ఆఖరులో వరుసగా నాలుగు రోజులపాటు బ్యాంకుల కార్యాలయాలు మూత పడనున్నాయి.
పది ప్రభుత్వ బ్యాంకులను నాలుగు పెద్ద బ్యాంకులుగా విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో సమ్మె చేపట్టాలని
ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఎఐబిఒసి), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఎఐబిఒఎ), ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ (ఐఎన్‌బిఒసి), నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ ఆఫీసర్స్ (ఎన్‌ఒబిఒ) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సమ్మెకు సిఐటియు తదితర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో, 26, 27 తేదీల్లో బ్యాంకుల కార్యకలాపాలు పూర్తిగా స్థంభించ నున్నాయి. 28న నాలుగో శనివారం, ఆదివారం వారాంతపు సెలవు కాబట్టి బ్యాంకులు తెరుచుకోవు.
26, 27 తేదీల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ ఆర్‌టిజిఎస్ /ఎన్‌ఇఎఫ్‌టి/ ఐఎంపిఎస్/ యుపిఐ లావాదేవీలకు ఆటంకం ఉండక పోవచ్చు.
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ అక్టోబర్ 22న సమ్మె చేపట్టనున్నట్లు బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బెఫీ), ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబిఇఎ) ప్రకటించాయి.