Politics

చిదంబరానికి మన్మోహన్-సోనియాల పరామర్శ

Manmohan Sonia Gandhi Meets Chidambaram In Tihar Jail

ఐఎన్ఎక్స్ మీడియా కుంభ‌కోణం కేసులో మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబ‌రం ప్ర‌స్తుతం తీహార్ జైలులో ఉన్న విష‌యం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ఇవాళ ఉద‌యం తీహార్ జైలుకు వెళ్లి చిదంబ‌రాన్ని ప‌రామ‌ర్శించారు.

దీంతో త‌మ పార్టీ నేత‌ల ప‌ట్ల తాము అండ‌గా ఉంటామ‌న్న సంకేతాన్ని కాంగ్రెస్ పార్టీ స్ప‌ష్టంగా వినిపించింది.

ఆగ‌స్టు 21వ తేదీన చిదంబ‌రాన్ని అరెస్టు చేశారు. సోనియా, మ‌న్మోహాన్ వ‌చ్చి త‌న‌ను క‌ల‌వ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్లు ట్వీట్ చేయాల‌ని త‌న కుటుంబ‌స‌భ్యుల‌కు తెలిపిన‌ట్లు చిదంబ‌రం వెల్ల‌డించారు.

ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ‌లో విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించేందుకు లంచం తీసుకున్న‌ట్లు చిదంబ‌రంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీకి చెందిన మ‌రో నేత‌ డి.శివ‌కుమార్ కూడా జైలులో ఉన్నారు.

ఆయ‌న్ను కూడా కాంగ్రెస్ టాప్ నేత‌లు క‌లుసుకునే వీలు ఉన్న‌ది.