DailyDose

చంద్రబాబు నివాసం కూల్చివేత దిశగా అడుగులు:తాజావార్తలు-09/23

YSRCP Govt Moving Ahead To Demolish Chandrababus House

* కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడాల కూల్చివేత క్రతువును ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం ‘సి ఆర్ డి ఏ’ అధికారులు రెండు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. చంద్రబాబు నివాసం కూల్చివేత దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది
* ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కొద్దిసేపటి కిందట ముగిసింది.
* చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం జెట్టి గుండ్లపల్లిలో ఒక బాలికపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన సంఘటన కలకలం రేపింది
* పోలవరం రివర్స్ టెండరింగ్ ఒక డ్రామా అని మాజీ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు
* పోలవరం రీ టెండర్లలో ప్రభుత్వానికి 628 కోట్ల రూపాయిలు ఆదా అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి
* అయోధ్యలో రాముడికి బంగారు గుడి కడతామని హిందూ మహా సభకు చెందిన స్వామీ చక్రపాణి వెల్లడించారు
* రాష్ట్ర ఇర్రిగేషన్ ముఖ్య కార్యాదర్శి ఆదిత్యనాద్ దాసుకు జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు జరీ చేసింది
* పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఆరవ రోజు పెరిగాయి
* ఈ నెల 28 నుంచి తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా కేసీఆర్ కు జగన్ ఆహ్వాన పత్రిక అందజేశారు.
* హైదరాబాద్ మార్కెట్ లో కేజీ ఉల్లి ధర రూ.50 కి చేరుకుంది
* తీహార్ జైలులో ఉన్న మాజీ ఆర్ధిక మంత్రి చిదంబరంను కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ , మన్మోహన్ సింగ్ కలిసారు
* బంగారం ధర 10 గ్రాములు రూ.39070 లకు చేరింది
* పూరీ జగన్నాధ్ కథను ఒకే చేసిన మహేష్ బాబు
* జగన్ ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా పతకం కొద్ది మంది రైతులకే లబ్ది చేకూర్చేలా ఉందని రైతులు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు
* టిటిడి నూతన పాలకవర్గం నేడు ప్రమాణస్వీకారం చేసింది
* నాలుగు సార్లు ఎమెల్యేగా గెలిచిన తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పదవి ఇవ్వకుండా అవమాన పరిచారని కోరుట్ల ఎమెల్యే విద్యా సాగర్ రావు కార్యాకర్తల ముందు కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు.