Movies

రైల్వే ఆలోచనలు

Parineethi Chopras The Girl On The Train Remake

ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడు మోసం చేశాడు. దీంతో అతడి నుంచి విడిపోయింది.. విడాకులు తీసుకుంది. ఈ క్రమంలోనే మద్యానికి బానిసైంది. అయిన వారు లేరు.. ఆదరించే వారు లేరు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఇలా ఆలోచిస్తూనే రైలెక్కింది. గమ్యస్థానం తెలియకుండా రోజూ రైల్లో ప్రయాణం చేస్తుంటుంది. ఊహించని పరిణామం ఎదురవుతుంది ఓ రోజు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అదే ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’. ఈ మూవీలో బాలీవుడ్ భామ పరిణితి చోప్రా లీడ్ రోల్ లో నటించింది. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్ రిలీజ్ చేసింది యూనిట్. పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. ముఖం మీద గాయాలతో బాత్‌ టబ్‌ లో కూర్చొని ఉన్న పరిణితి లుక్ ఆకట్టుకుంటోంది. రిబు దాస్ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.