DailyDose

TV9 రవిప్రకాశ్‌కు మళ్ళీ చుక్కెదురు:నేరవార్తలు-09/24

TV9 Raviprakash Requests Denied-Telugu Crime News-09/24

* ముందస్తు బెయిల్‌లో ఉన్న నిబంధనలను తొలగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పోలీసు స్టేషన్‌కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రవిప్రకాశ్‌ హైకోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. టీవీ9 చానెల్‌లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవిప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా టీవీ9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు రూ. 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసును ఆయన ఎదుర్కొంటున్నారు.
* ప్రత్తిపాడు మండలం, ఈదులపాలెం గ్రామంలోని ం ఋ ఋ టుబాకో కంపిని లో ప్రత్తి బెడ్లు దగ్ధం, హైవే ప్రక్కనున్న మిట్టపల్లి రామారావు గుడెమ్స్ లో మంటలు రావటం చూసి తక్షణం స్పందించిన గ్రామస్తులు అక్కడకు వెళ్లి సెక్యూరిటీకి తెలియచేసి, గోడెమ్స్ తీయించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయటం జరిగింది. తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది గూడెం మొత్తం మంటలు వ్యాపించక ముందే నియంత్రించటానికి ప్రయత్నం చేశారు. అదే గ్రామంలో వైష్టవి వెంచర్ లో కుండా వెళ్లిన 11 క్వ్ కరెంట్ వైరు తెగి ఇళ్లపై పడింది అదృష్టవశాత్తు ఎవ్వరికి ఎలాంటి నష్టం లేదు. వెంటనే స్పందించిన కరెంట్ అధికారులు. అదే గ్రామంలో వేరు వేరు ప్రాంతాల్లో ఈ రెండు ప్రమాదాలు ఒకే రోజు జరగటం వలన గ్రామస్తులు భయబ్రాంతులకు గురి అయ్యారు.
* ఎంఆర్‌ఐ మేషిన్‌లో రోగిని ఉంచి మరిచిపోయిన వైనం హర్యానాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చోటు చేసుకుంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయించుకునేందుకు హర్యానాలోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ పూర్తయ్యేందుకు పది నుంచి పదిహేను నిమిషాల సమయం పడుతుందని టెక్నిషీయన్‌.. రోగికి చెప్పాడు. దీనికి రోగి అంగీకరించడంతో.. అతడిని ఎంఆర్‌ఐ మేషిన్‌లోకి పంపించాడు టెక్నిషీయన్‌. స్కానింగ్‌ పూర్తయినప్పటికీ రోగిని బయటకు తీయకుండా టెక్నిషీయన్‌ మరిచిపోయాడు. దీంతో సుమారు అరగంట పాటు కష్టపడి.. బెల్టులను తెంపుకుని రోగి బయటకు వచ్చాడు. అనంతరం ఆస్పత్రి సిబ్బందిపై రోగి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించారు. పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
నేరారోప‌ణ కేసుల్లో విచార‌ణ ఎదుర్కొంటున్న నేర‌స్థుడికి సంబంధించిన స్థిరాస్తుల‌ను పోలీసులు స్వాధీనం చేసుకోరాదు అని ఇవాళ సుప్రీంకోర్టు త‌న తీర్పులో వెల్ల‌డించింది. చీఫ్ జ‌స్టిస్ రంజ‌న్ గ‌గోయ్‌, జ‌స్టిస్ దీప‌క్ గుప్తా, సంజీవ్ ఖ‌న్నాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పునిచ్చింది. సీఆర్‌పీసీలోని 102వ సెక్ష‌న్ ప్ర‌కారం.. క్రిమిన‌ల్ కేసులో విచార‌ణ ఎదుర్కొంటున్న వ్య‌క్తి ఆస్తుల‌ను అటాచ్ చేసే అధికారం పోలీసుల‌కు లేద‌ని కోర్టు చెప్పింది. * మ‌హారాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల‌ను స‌వాల్ చేస్తూ ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం దాఖ‌లు చేసిన అభ్య‌ర్థ‌న‌పై ఈ కోర్టు ఈ విధంగా స్పందించింది. ఆస్తుల‌ను అటాచ్ చేసే అధికారం పోలీసుల‌కు లేద‌ని ఓ కేసులో బాంబే హైకోర్టు పేర్కొన్న‌ది. దాన్ని మ‌హా ప్ర‌భుత్వం స‌వాల్ చేసింది.
* పట్టణానికి చెందిన యువకుడు మంగళవారం మున్సిపల్ పార్కు లో ఒక చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చూపరులను కలవరపరిచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తూర్పు గోదావరి జిల్లా మండపేట కు చెందిన అవివాహితుడు అడపా శివ కుమార్ (27) అనే వ్యక్తి పట్టణంలో కొన్నాళ్ల క్రితం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను నిర్వహించేవాడు. ఈ క్రమంలో శివ చెడు వ్యసనాలకు బానిసై వ్యాపారం సరిగా నడవక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ను మూసివేసి ఒక నెల నుండి హైదరాబాదులో ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసాడనీ,అక్కడ కూడా ఉండలేక తిరిగి స్వగ్రామమైన మండపేట వచ్చి కొన్నాళ్లుగా తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు, సోమవారం మధ్యాహ్నం నుండి మద్యం సేవించి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకున్నాడనీ, ఆ గొడవలో నేను చనిపోతాను అంటూ చెయ్యి కోసుకున్నాడనీ, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళిన క్రమంలో అతని జేబులో నాచావుకి ఎవ్వరూ బాధలు కాదని నేను అందరినీ బాధపెట్టాననీ, అందువలనే నేనుచనిపోతున్నానను అని ఉన్న సూసైడ్ నోట్ను తన అన్న స్వాధీన పరుచుకుని వైద్యం చేయించడం మళ్ళీ యధావిధిగా రాత్రి మద్యం సేవించి వచ్చి గొడవ పడ్డాడనీ, అనంతరం రాత్రి 11గంటల సమయం లో ఇంట్లో ఉన్న బెడ్ షీట్ ను చింపుకుని వచ్చి పట్టణంలో 8వ వార్డు కొండపల్లి కొండపల్లి వారి వీధి నందు ఉన్న శ్రీ నందమూరి తారక రామారావు మున్సిపల్ పార్కు లో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తెలిపారు. పట్టణ ఎస్ఐ .తోట సునీత అనుమానాస్పదం గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* చిత్తూరు జిల్లా, తంబల్లపల్లి తాలూకా బి.కొత్తకోట పట్టణం హడ్కో కాలనీలో అప్పుడే పుట్టిన బిడ్డ ముళ్ళ చెట్లలో పడేసి వెళ్లిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు. బిడ్డకు ముల్లు గుచ్చు కోని రక్త గాయాలు కావడంతో బీ.కొత్తకోట ప్రభుత్వాసుపత్రికి తరలించిన స్థానికులు.
* మాజి స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య కేసులో కొనసాగుతున్న విచారణ. 18 మంది సాక్షులను విచారిరించిన పోలీసులు. కోడెల చివరి కాల్ గన్ మేన్ ఆదబ్ చేసినట్లు గుర్తింపు కోడెల సెల్ ఫోన్ ను పోలీసులకు అప్పగించిన కుటుంబసభ్యులు. స్టేట్మెంట్ కోసం రావాలని కొడుకు శివరాం కూతురు విజయలక్ష్మి కి నోటీసులు. కోడెల ఆత్మహత్య కేసులో హైకోర్టులో పిటీషన్ వేసిన అనిల్ బూర్లగడ్డ. సీబీఐ విచారణ జరిపించాలని వేసిన పిటీషన్ హైకోర్టు కొట్టివేత.
* శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మాజీ ఎమ్మెల్యే, కూన రవికుమార్ కి హైకోర్టులో బెయిల్ మంజూరు. సరుబుజ్జిలి మండలం ఎంపీడీవో ని దూషించారని గత నెల 27 న పోలీస్ స్టేషన్ లో కూన రవికుమార్ పై పిర్యాదు. 28 రోజులు తరువాత అజ్ఞాతం వీడనున్న కూన రవికుమార్
* కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని కొండాపురం మండలం యనమలచింతల గ్రామంలో విషాదం. చిత్రావతి నది లో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి. బాబా వల్లి(26), అన్వర్ బాషా (13) మృతి.
* గోప్యతగా జరుగుతున్న సచివాలయ ఉద్యోగ నియామక ప్రక్రియ అభ్యర్థుల్లో అనేక సందేహాలకు తావిస్తోంది. తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తి ప్రతిభా జాబితాలో తొలి స్థానంలో ఉండటం… ఎక్కువ మార్కులు వచ్చిన వ్యక్తులు ఎక్కడో అధమ ర్యాంకులో ఉండటంపై అభ్యర్థుల్లో అసహనం వ్యక్తమవుతోంది.
* ఎవరి ర్యాంకు ఎంత… వారికి వచ్చిన మార్కులెన్నో ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు – http://gramavolunteer2.ap.gov.in/apresults/APresult.aspx