తెలుగు రాష్ట్రాల్లో సంపన్నులు వీరే! టాప్ 100లో మేఘా ఇంజినీరింగ్ నుంచి ఇద్దరు
భారత అత్యంత శ్రీమంతుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ముఖేష్ అంబానీ తొలి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన వరుసగా ఎనిమిదో సంవత్సరం మొదటి స్థానం దక్కించుకున్నారు. భారత్‌లోని రిచ్చెస్ట్ పర్సన్స్‌పై ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్, హ్యూరన్ ఈ జాబితాను సిద్ధం చేసింది. టాప్ 10లో ఆయా పారిశ్రామికవేత్తలు ఉన్నప్పటికీ టాప్ 99లో తెలుగువారికీ కూడా చోటు దక్కింది.
గత ఏడాది కంటే తగ్గిన ధనికుల సంపద ఈ జాబితాలో చోటు దక్కాలంటే నికర సంపద రూ.1000 కోట్లు దాటాలి. 2019లో ఈ పరిమితికి మించి నికర సంపద కలిగి జాబితాలో చోటు దక్కిన వారి భారతీయుల సంఖ్య 953. గత ఏడాది ఈ సంఖ్య 831గా ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే సగటున అత్యంత ధనవంతుల ఆస్తులు 11 శాతం మేర తగ్గాయి. కొత్తవారి చేరికతో అందరి మొత్తం మాత్రం 2 శాతం పెరిగింది. గత ఏడాదిలో జాబితాలో చోటు దక్కించుకున్న వారిలో 344 మంది సంపద తగ్గిపోగా, 112 మంది రూ.1,000 కోట్ల జాబితాలో లేకుండా పోయారు.
టాప్ 3 వీరే… ఈ జాబితాలో 953 మంది భారతీయులు ఉన్నారు. గత ఏడాది కంటే ఈసారి 122 ఎక్కువ మంది చోటు దక్కించుకున్నారు. అంటే 15 శాతం మంది పెరిగారు. 2016తో పోలిస్తే 181 శాతం పెరిగారు. అత్యంత ధనికుడైన ముఖేష్ అంబానీ ఆస్తులు రూ.3,80,700 కోట్లు. ఆ తర్వాత భారత సంతతి లండన్ వాసులు హిందూజా, కుటుంబ సభ్యులు రెండో స్థానంలో ఉన్నారు. మూడో స్థానంలో విప్రో అజీమ్ ప్రేమ్ జీ ఉన్నారు.
మహిళా శ్రీమంతులు.. జాబితాలో 152 మంది మహిళలకు చోటు దక్కింది. వీరి సగటు వయస్సు 56 ఏళ్లు. హెచ్‌సీఎల్ ఎంటర్ ప్రైజెస్ సీఈవో రోషిణి నాడర్ అత్యంత శ్రీమంతురాలు. ఆ తర్వాత గోద్రేజ్ గ్రూప్ స్మితా వి కృష్ణ ఉన్నారు. బయోకాన్ కిరణ్ మజుందార్ షా కూడా స్థానం దక్కించుకున్నారు
ఓయో రూమ్స్ సీఈవో.. పిన్న వయస్సుడు ఓయో రూమ్స్ సీఈవో రితేష్ అగర్వాల్ వయస్సు పాతిక సంవత్సరాలు. అతని నికర సంపద రూ.7500 కోట్లు. జాబితాలో నలభై ఏళ్ల లోపు ఉన్న వారిలో మీడియా డాట్‌నెట్‌కు చెందిన దివ్యాంక్ కూడా ఉన్నారు. 82 మంది ప్రవాసులకు చోటు దక్కింది. వీరిలో 76 శాతం మంది స్వయంశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదగడం గమనార్హం. అమెరికా, యూఏఈ, బ్రిటన్‌లలో ఉన్నారు.
ముంబై టాప్… అత్యంత ఎక్కువ మంది శ్రీమంతులు ముంబై నుంచి ఉన్నారు. 246 మంది ఈ నగరానికి చెందిన వారే కావడం గమనార్హం. ఆ తర్వాత 175 మందితో ఢిల్లీ, 77 మందితో బెంగళూరు నిలిచింది. జాబితాలో మొదటి 25 స్థానాల్లో నిలిచిన వాళ్ల మొత్తం సంపద భారత జీడీపీలో 10 శాతం కావడం గమనార్హం. 953 మంది సంపద జీడీపీలో 27 శాతం.
తెలంగాణ నుంచి 68, ఏపీ నుంచి 9 మంది ఈ జాబితాలో హైదరాబాద్ నుంచి 63 మందికి చోటు దక్కింది. టాప్ 99లో హైదరాబాదీలు ఉన్నారు. 2018తో పోలిస్తే 17 మంది సంపన్నులు పెరిగారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ నుంచి 68 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మందికి చోటు దక్కింది.
100 ర్యాంకుల్లో తెలుగోళ్లు వీరే… ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యంత సంపన్నులుగా గల్లా రామచంద్ర నాయుడు కుటుంబం నిలిచింది. ఇక, తొలి 100 ర్యాంకుల్లో తెలుగువారు ఐదుగురు ఉన్నారు. టాప్ 100లో వీరే… – పీవీ రాంప్రసాద్ రెడ్డి – అరబిందో ఫార్మా – రూ.14,800 కోట్లు (51వ ర్యాంక్) – పీ.పిచ్చిరెడ్డి (పిపి రెడ్డి) – మేఘా ఇంజినీరింగ్ – రూ.13,400 కోట్లు (57వ ర్యాంక్) – పీ.వీ. కృష్ణారెడ్డి – మేఘా ఇంజినీరింగ్ – రూ.12,900 కోట్లు (63వ ర్యాంక్) – దివి సత్యంద్ర కిరణ్ – దివీస్ లేబోరేటరీస్ – రూ.10,200 కోట్లు (83వ ర్యాంక్)