Food

గోధుమ రవ్వ ఉప్మా ఆరోగ్యానికి మంచిది

Wheat Ravva Upma Is Good For Health | TNILIVE Telugu Food News

ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. కానీ ప్రస్తుతం అన్నీ నాసిరకమే. తినే ఆహారంలో సైతం పోషక విలువలు ఉండట్లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది అన్నం బదులు గోధుమ రవ్వతో చేసిన పదార్థాల్ని తింటున్నారు. గోధుమ రవ్వను ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే లాభాలేంటంటే..
-గోధుమ రవ్వలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. బరువు పెరగడానికి, కండరాల నిర్మాణానికి ఇది సరైన ఆహారం. దీన్ని ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. అల్పాహారంగా, లంచ్‌లో, డిన్నర్‌లో ఏ వేళలోనైనా తీసుకోవచ్చు. దీంతో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు కూడా లభిస్తాయి.
-గోధుమ రవ్వలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో జంక్‌ఫుడ్ తినడానికి దూరంగా ఉండవచ్చు. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా కూడా దీన్ని తీసుకోవచ్చు. రోజంతా ఆక్టివ్‌గా ఉండడానికి ఇది పనిచేస్తుంది. అవసరమైన న్యూట్రిషిన్లు కూడా లభిస్తాయి.
-షుగర్ ఉన్నవారికి ఇది సరైన ఆహారం. ఇది శరీరంలోని గ్లూకోస్‌ను నియంత్రిస్తుంది. దీంతో షుగర్ లెవెల్స్ నియంత్రించడం సులువవుతుంది.
-రోజూ గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తినడం వల్ల శరీరం దృఢపడుతుంది. మెటబాలిజం కూడా మెరుగుపడుతుంది. మలబద్ధక సమస్యను పూర్తిగా పరిష్కరిస్తుంది. హై ఫైబర్, ప్రొటీన్స్‌ను కలిగి ఉంటుంది.
-మధుమేహంతో బాధపడుతున్నవారు కూడా గోధుమరవ్వతో చేసిన ఉప్మాను తినొచ్చు.