NRI-NRT

దక్షిణాఫ్రికాలో బతుకమ్మకు ముఖ్య అతిథిగా తానా అధ్యక్షుడు

Jay Talluri Attends Telangana Association Of South Africa TASA Batukamma 2019

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌతాఫ్రికా (TASA) ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు తానా అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయారు. శనివారం నాడు నిర్వహించిన ఈ వేడుకల్లో 1500 మంది ప్రవాసులు పాల్గొన్నారు. జయశేఖర్ కీల్కఓపన్యాసం చేస్తూ తానా చేస్తున్న కృషిని, సేవా కార్యక్రమాలను వివరించారు. స్థానిక తెలుగువారితో సమావేశమయిన జయశేఖర్ దక్షిణాఫ్రికాలో తెలుగువారి జీవనశైలు, ఉద్యోగ, వ్యాపార అవకాశాలపై చర్చించారు.