NRI-NRT

బోస్టన్ నాట్స్ విభాగం ఆధ్వర్యంలో ఇళయరాజా పాటల హోరు

NATS Boston Chapter Conducts Ilayaraja Songs Medley

నాట్స్ బోస్టన్ విభాగం ఇళయరాజా పాటల కార్యక్రమాన్ని నిర్వహించింది. బోస్టన్ పరిసర ప్రాంతాల్లోని కళాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నాట్స్ అధ్యక్షుడు మంచికలపూడి శ్రీనివాసబాబు తెలిపారు. మధుచారి ఆధ్వర్యంలో 21 మందితో గాయనీ, గాయకులతో కూడిన మధురవాణి బృందం ఇళయరాజా స్వరపరిచిన పాటలను అద్భుతంగా ఆలపించి అతిథులను అలరించారు. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ బోర్డ్ సభ్యులు మోహనకృష్ణ మన్నవ, శ్రీహరి మందాడి, రంజిత్ చాగంటి, వంశీ వెనిగళ్ల, తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ బోస్టన్ అధ్యక్షుడు సీతారాం అమరవాది, నాట్స్ బోస్టన్ విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ గొంది తదితరులు పాల్గొన్నారు.