Politics

తెలంగాణా ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన హైకోర్టు

Telangana High Court Summons KCR On Land Allotment To Sarada Peetham

శారద పీఠానికి భూమి కేటాయించడంపై హై కోర్ట్ సీరియస్..! కోట్ల విలువ గల భూమి.. రూపాయికే ఎకరం చొప్పున అమ్మకం. చౌకగా అమ్మడానికి గల కారణాలు తెలపాలని నోటీసుల జారీ. హైదరాబాద్లో అత్యంత చౌక ధరకు భూమిని విశాఖ శారద పీఠానికి కేటాయించడంపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేవలం రూపాయికి ఎకరం చొప్పున కోట్ల విలువైన భూమిని కేటాయించడంపై ప్రభుత్వం వైఖరి ఏంటో తెలపాలని సర్కారుకు నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని కోకాపేటలో విశాఖ శారదపీఠానికి రూపాయికి ఎకరం చొప్పున.. రెండు ఎకరాలను కేటాయిస్తూ జూన్ 22న ప్రభుత్వం జీవో 71 జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ సికింద్రాబాద్ లాలాపేట్కు చెందిన సీహెచ్ వీరాచారి అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కోకాపేటలో భూముల మార్కెట్ విలువ కోట్ల రూపాయలు ఉన్నదని… అయితే చట్టవిరుద్ధంగా కేవలం ఒక్క రూపాయికే ఎకరం కేటాయించారని ఆరోపించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేసి.. భూ కేటాయింపులు రద్దు చేయాలని కోరారు. స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ ఎండీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో పాటు.. శారదపీఠం ధర్మాధికారికి నోటీసులు జారీ చేసింది.
Telangana High Court Summons KCR On Land Allotment To Sarada Peetham