Health

ఆరోగ్య సిరి…స్ట్రాబెరీ

The health benefits of Strawberry | Telugu Health News

ఎరుపు రంగులో, హృదయాకారంలో ఉండే స్ట్రాబెరీ పోషకాల నిధి. వీటిని ఎక్కువగా ఫ్రూట్ సలాడ్స్‌లో, ఐస్‌క్రీమ్ తయారీలో విరివిగా వాడుతుంటారు. ఎక్కువ పీచు, తక్కువ క్యాలరీలతో నిండిన ఈ పండును ఆరోగ్య సిరి అనొచ్చు. స్ట్రాబెరీ వల్ల ఆరోగ్యానికి లాభమెలా జరుగుతుందంటే..స్ట్రాబెరీలలో సి, కె వంటి విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్ట్రాబెరీలోని పొటాషియం, మెగ్నీషియం హైపర్‌టెన్షన్‌ను తగ్గిస్తాయి. హృదయ కండరాలు గట్టిపడడాన్ని అడ్డుకుంటాయి. రక్తసరఫరా సవ్యంగా జరుగుతుంది.స్ట్రాబెరీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారించి, గుండెపోటు ప్రమాదం నుంచి కాపాడుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెరీ ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో కొవ్వును కరిగించే లెప్టిన్, అడిపోనెక్టిన్ వంటి హార్మోన్లు ఉంటాయి. ఇవి ఆకలిని తగ్గించి, రక్తంలో చక్కెర శాతం పెరగకుండా చూస్తాయి.గర్భిణులు ఈ పండు తింటే వారికి అవసరమైన ఫోలిక్ ఆమ్లం లభిస్తుంది. ఇది పుట్టబోయే బిడ్డలో లోపాలు ఏర్పడకుండా చూస్తుంది. స్ట్రాబెరీలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను రిలాక్స్ చేస్తాయి. రక్తపీడనాన్ని తగ్గించి, గుండె సంబంధ వ్యాధుల్ని నివారిస్తాయి.కళ్లమీద స్ట్రాబెరీ ముక్కలను పదినిమిషాలు ఉంచాలి. క్రమం తప్పకుండా వారం రోజులు ఈ చిట్కా పాటిస్తే కళ్లకింద నల్లటి వలయాలు పోతాయి. స్ట్రాబెరీలోని విటమిన్ సి కంటిచూపును మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతాయి.స్ట్రాబెరీలోని ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధి చెందడానికి, మెదడు పనితీరును మెరుగుపర్చడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మంపై ద ద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి, అలర్జీ వంటి సమస్యలున్నవారు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ స్ట్రాబెరీ పండ్లను తీసుకోకూడదని వైద్యులు చెబుతున్నారు.