Fashion

మధురమైన అధరాలకు పుచ్చకాయ రసం

Telugu Fashion & Beauty Tips | Lips Health Can Be Saved By WaterMelon Juice

పెదాలకూ సరైన పోషణ అందితేనే… అవి గులాబీరంగులో మెరుస్తాయి. తాజాగా ఉంటాయి. అందుకు ఏం చేయాలో చూద్దామా…

తేనె… ప్రతిరోజూ ఓ చెంచా తేనె తీసుకోండి. కొద్దిగా తేనెను పెదాలకు పూతలా రాసుకుని ఆరాక కడిగేస్తే ఆరోగ్యంగా ఉంటాయి.
టొమాటో… తీసుకునే ఆహారంలో ఇది తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఎండలో నుంచి రాగానే ఈ పండు రసాన్ని పెదాలకు పూసి ఆరిన తరువాత కడిగేయాలి.
గ్రీన్‌ టీ… టీ, కాఫీలు తాగడం వల్లా అధరాలు నల్లగా మారతాయి. వాటికి బదులు ఓ కప్పు గ్రీన్‌ టీ తీసుకోండి. ఇందులోని పాలీఫినాల్స్‌ పెదాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. టీ బ్యాగులతో అధరాలపై మృదువుగా మర్దన చేసినా నలుపుదనం తగ్గుతుంది.
వాల్‌నట్లు… వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలుంటాయి. ఇవి కొలాజెన్‌ ఉత్పత్తిని పెంచుతాయి. ఇది చర్మం సాగే గుణాన్ని కలిగి ఉండటానికి తోడ్పడుతుంది. పెదాల్ని ఆరోగ్యంగా, తేమగా ఉంచుతాయివి.
నిమ్మ… శరీరంలో మలినాలు పేరుకుపోయినా పెదాలు నల్లగా మారే ప్రమాదం ఉంది. గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే మలినాలు బయటకు పోతాయి. వారానికోసారి నిమ్మ చెక్కపై కాసింత చక్కర వేసి దాంతో పెదాలపై రుద్దితే మృతకణాలు తొలగిపోవడంతోపాటు నలుపూ తగ్గుతుంది.
పుచ్చకాయ… అధిక మొత్తంలో నీరుండే ఈ పండును తీసుకోవడం వల్ల పెదాలు తాజాగా మారడంతోపాటు చక్కటి రంగును సంతరించుకుంటాయి.