DailyDose

జగన్ ఎందుకు మొహం చాటేశారు-తాజావార్తలు-10/06

Yanamala Questions YS Jagan | Telugu Breaking News Today-10/06

* తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె, ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష ఏర్పాటు చేశారు. ఆర్టీసీలో అద్దె బస్సులను 50 శాతానికి పెంచడం, అర్హులైన యువతీయువకులను డ్రైవర్లు.. కండక్టర్లుగా నియమించి వారికి త్వరితగతిన శిక్షణ అందించడం, ప్రైవేటు సర్వీసులకు రూట్‌ పర్మిట్లు ఇవ్వడం వంటి ప్రతిపాదనలపై ఈ సమీక్షలో నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఆదివారం భారీ విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అద్భుత విజయం నమోదు చేసింది. 395 పరుగుల లక్ష్యంతో శనివారం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన పర్యాటక జట్టు 191 పరుగులకు కుప్పకూలింది. ఈ నేపథ్యంలో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో తొలి టెస్టులో గెలుపొందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర అద్వితీయమని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేల మంది ఆర్టీసీ కార్మికులు గతంలో రాష్ట్ర సాధన కోసం తమ వంతు పాత్ర పోషించారన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉద్ధృతం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ ఊసరవెల్లిలా రంగులు మార్చారని లేఖలో విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ తన చేతకాని తనాన్ని కప్పి పెట్టేందుకే దిల్లీ పర్యటనలో మీడియాకు ముఖం చాటేశారని ఏపీ మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రధానితో భేటీలో సీఎం జగన్ ఏం చర్చించారో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. ప్రధానితో చర్చల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కశ్మీర్‌లోని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత ఫరూక్‌ అబ్దుల్లా రెండు నెలల తర్వాత పార్టీ నేతలతో నేడు భేటీ అయ్యారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు నేపథ్యంలో ఆయన్ను రెండు నెలల నుంచి గృహనిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేతలు అక్బర్‌ లోన్‌, హస్నాని మసూద్‌ మాట్లాడుతూ ‘‘ మేము కేవలం అబ్దుల్లా ఎలా ఉన్నారనే విషయం తెలుసుకునేందుకు వచ్చాము. ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదు. మా పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనదు. మా నాయకత్వం మొత్తం జైల్లో ఉంది.’’ అని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలోని సుల్తాన్‌పూర్ గ్రామ సమీపంలో ఓ శిక్షణ విమానం కూలింది. గ్రామ సమీపంలోని పత్తి చేనులో విమానం కూలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు సమాచారం. వైమానిక అధికారులు ఘటనాస్థలికి వెళ్లి ప్రమాదం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్థమాన్‌ పనిచేస్తున్న 51స్క్వాడ్రన్‌కు ఐఏఎఫ్‌ యూనిట్‌ సైటేషన్‌ అవార్డును ప్రకటించంది. దీంతోపాటు బాలాకోట్‌పై దాడులు నిర్వహించిన 9వ స్క్వాడ్రన్‌కు, పాక్‌ విమానాల సమాచారాన్ని ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేసిన మింటి అగర్వాల్‌ నేతృత్వంలోని 601 స్క్వాడ్రన్‌కు కూడా దీనిని ప్రకటించారు. అభినందన్‌ వర్థమాన్‌ బృందం ప్రతిదాడి, బాలాకోట్‌ దాడుల విషయం అందరికి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణ రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ప్రభుత్వం ఆర్టీసీని బలహీన పరచాలని చూడడం సరికాదన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు కోడందరామ్‌ను కలిసి సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వమే కారణమని…కార్మికుల సమ్మెకు ప్రతి ఒక్కరు కదిలి రావాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నిరసనకారులు ఆదివారం భారీయెత్తున నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్‌వోసీ దాటొద్దని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ శనివారం వారిని హెచ్చరించారు. కశ్మీరీలకు మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు ఎల్‌వోసీని దాటితే భారత్‌ చెప్పే కథనాలకు బలం చేకూరుతుందని అన్నారు. ఆయన మాటలు నిరసనకారులను నిలువరించేలా కాకుండా ఎగదోసినట్టు కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* టయోటా మార్కెట్లోకి సరికొత్త కారును విడుదల చేసింది. గ్లాన్జా జి ఎంటీ వేరియంట్‌ను విడుదల చేసింది. మారుతీ సుజుకీ బాలినో ప్లాట్‌ఫామ్‌పై దీనిని తయారు చేస్తున్నారు. దిల్లీ ఎక్స్‌ షోరూమ్‌లో దీని ధర రూ.6.98లక్షలుగా నిర్ణయించారు. దీనిలో స్మార్ట్‌ హైబ్రీడ్‌ సిస్టమ్‌ను అమర్చలేదు. దీంతో కారు ధర రూ.24వేలు తగ్గింది. ప్రస్తుతం గ్లాన్జా జీ, వీ వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఇవి బాలినోలో జీటా, ఆల్ఫాలతో సమానం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి