NRI-NRT

ర్యాలీలో హైదరాబాదీ మహిళ అనుమానస్పద మృతి

Hyderabadi Lady Gajam Vanitha Murdered In North Carolina

అమెరికాలోని నార్త్ కరోలినాలో హైదరాబాద్​కు చెందిన గజం వనిత అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆత్మహత్య చేసుకుందంటూ హైదరాబాద్ నాగోల్​లోని తల్లిదండ్రులకు సమాచారమందింది. అత్తింటి వేధింపులే తమ కుమార్తెను బలి తీసుకున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భర్తతో విభేదాలు, అత్తింటి వేధింపులు తట్టుకోలేక వనిత కొంతకాలం హైదరాబాద్​లో ఉంది.భర్తే చంపాడా..?గత జూలైలో వనిత భర్త దగ్గరకు వెళ్లినా రెండు నెలల నుంచి తామెవ్వరితోనూ కాంటాక్ట్​లో లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. వనిత ముఖంపై దిండుతో అదిమి భర్తే తనను చంపినట్లుగా అక్కడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనానంతరం భర్త రాచకొండ శివకుమార్​ను కరోలినా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురి మరణవార్తతో వనిత ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి.