Agriculture

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అమలు

Telugu Agricultural News | AP Agri Minister Kannababu Says Rythu Bharosa Will Be Implemented From October 15th

అక్టోబర్ 15 నుంచి రైతు భరోసా అమలు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

వైఎస్సార్ రైతు భరోసా అమలు దిశగా ప్రభుత్వ చర్యలు….

రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మంది గుర్తింపు

అక్టోబర్ 15 నుంచి రైతులకు పన్నెండు వేల ఐదు వందలు చొప్పున పెట్టుబడి సాయం

పంటల బీమా ప్రీమియం చెల్లింపు, వడ్డీ లేని రుణాలు ఇచ్చే ఏర్పాటు…

కౌలు రైతులకు సాయం, 11 నెలల కాలానికి ప్రత్యేక కార్డు..

భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా వైయస్సార్ రైతు భరోసా పెట్టుబడి సహాయ కార్యక్రమం వర్తిస్తుందన్నారు..

రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా రైతు సంక్షేమమే ముఖ్యమంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న ప్రారంభిస్తున్నాం అన్నారు…

అక్టోబర్ 10న అన్ని గ్రామ సచివాలయ కేంద్రాల వద్ద రైతు భరోసా అర్హులు, అనర్హుల పట్టికను ప్రదర్శించడం జరుగుతుందన్నారు

దీనిపై అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు…

గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పెద్ద పీట వేయడం జరిగిందని, వీటిని సరిచేయడానికి రైతులు అర్హులు సహకరించాలని అన్నారు.

భూమి కలిగి ఉన్న లక్షా 7 వేల మంది రైతులు తమ వారసులను లబ్ధిదారులను గుర్తించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు…

రైతు భరోసా పథకం ద్వారా రైతులకు నేరుగా సాయం అందేవిధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు…

అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా అనర్హులను పూర్తి సమాచారం ద్వారా తొలగించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.