Food

పటికబెల్లం చాలా ప్రయోజనకారి

Telugu Food News | Sugar Crystals Health Benefits

రోజువారీ జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల అనారోగ్యాలు, ఇబ్బందులకు పటిక మంచి మందుగా పనిచేస్తుంది. అతి తక్కువ ఖర్చుతో మేలైన ప్రయోజనం ఇస్తుంది పటిక. సులువుగా లభ్యమయ్యే పటికతో ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూద్దాం.కొద్దిగా పటిక చూర్ణాన్ని కలిపిన నీటితో స్నానం చేస్తుంటే అధిక చెమటలు తగ్గుతాయి. ఈ నీటిని తలకు పట్టిస్తుంటే పేల బాధ తగ్గుతుంది.వ్రణాలను, గాయాలను పటిక నీటితో కడిగితే రక్తస్రావం ఆగిపోవడమే కాకుండా, అతి త్వరగా మానతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచీ రక్షణ లభిస్తుంది.పటిక నీటిని నోటిలో పోసుకుని పుక్కిలి పడితే, నోటిలో, అంగిలిలో, నాలుకపైన ఉన్న గుల్లలు, పుళ్లు, వ్రణాలు, టాన్సిల్స్‌ వాపు, నొప్పి మొదలైనవి తగ్గుతాయి. ఐదు గ్రాముల పటిక చూర్ణాన్ని 100 మి.లీ. పాలల్లో వేసి, కాచి వడగట్టి రోజూ మూడుపూటలా తాగుతుంటే నోరు, ముక్కు, మూత్ర, మలద్వారం వెంట రక్తం పడటం, రక్త విరేచనాలు, స్త్రీలలో బహిష్టు సమస్యలు తగ్గుతాయి.పొంగించిన పటిక చూర్ణానికి పదిరెట్ల పటిక బెల్లం కలిపి ఉంచుకుని, రోజులో ఒకటీ రెండుసార్లు పావు స్పూను నుంచి అరస్పూను వరకూ కళ్లెదగ్గు వున్నవారు వేడినీటితో, పొడిదగ్గు వున్నవారు వేడిపాలతో సేవిస్తే తగ్గుతాయి.పొంగించిన పటికను పూటకు 500 మి.గ్రా. వంతున తగినంత వెన్నలో కలిపి తీసుకుంటే శరీరంలో అమితవేడి తగ్గుతుంది.స్త్రీలలో ఎదురయ్యే వైట్‌డిశ్చార్జి, వ్రణాలు, దురద తగ్గుతాయి. పురుషులలో శుక్రకణాల వృద్ధికి పటికను అనేకరూపాల్లో ప్రకృతివైద్యంలో వినియోగిస్తారు.