NRI-NRT

తెలుగుదనానికి పట్టం కట్టిన సిలికానాంధ్ర సాంస్కృతికోత్సవం

SiliconAndhra 2019 Telugu Cultural Festival Mesmerizes Audience

సిలికానాంధ్ర ఆధ్వర్యంలో శనివారం నాడు హేవార్డ్‌లోని చాబోట్ కాలేజ్ సమావేశ మందిరంలో “తెలుగు సాంస్కృతికోత్సవాన్ని” ఘనంగా నిర్వహించారు. 250మంది ప్రవాసులు, చిన్నారులు, యువతీయువకులు ఈ ఉత్సవంలో పలు ప్రదర్శనల ద్వారా తెలుగుదనపు పరిమళాలను విస్తరింపజేశారు. వడాలి ఫణి నారాయణ వీణామృతం, శ్రీనివాస్ లింగా వాసు డప్పు వాయిద్యం, చిన్నారుల ఆధ్వర్యంలో బాలగంధర్వం, మధు ప్రాఖ్య రచనలో రూపొందిన వేనోళ్ల వెయ్యేళ్ల పద్యం, వందే నరసింహం, అనూష కూచిభొట్ల దర్శకత్వంలో జయహో తెలంగాణా తదితర ప్రదర్శనలు అలరించాయి. సుజనరంజని సావనీర్‌ను ప్రముఖ వైద్యులు డా.లకిరెడ్డి హనిమిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన అతిపిన్న వయస్కురాలు పూర్ణ మాలావత్‌ను సిలికానాంధ్ర సభ్యులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సిలికానాంధ్ర సభ్యులు కూచిభొట్ల ఆనంద్, శాంతి కూచిభొట్ల, కొండుభట్ల దీనబాబు, చమర్తి రాజు, కొండిపర్తి దిలీప్, తాటిపాముల మృత్యుంజయుడు, వేదుల స్నేహ, ప్రియ తనుగుల, కోట్ని శాంతి, కోట్ని శ్రీరాం, చింతలపూడి జ్యోతి, వేట శరత్ తదితరులు పాల్గొన్నారు.