Health

హైదరాబాద్ కాలుష్య జీవులకు శుభవార్త. రోజుకొక ఆస్ప్రిన్ వేసుకోండి.

Taking An Asprin EveryDay Helps Lungs Fight Polluted Air

వాయుకాలుష్యం వల్ల కలిగే దుష్ర్పభావాలకు ఆస్ర్పిన్‌ మాత్రతో అడ్డుకట్ట వేయచ్చని ఇటీవల ఒక పరిశోధనలో వెల్లడయింది. దీని ప్రకారం ఆస్ర్పిన్‌ వంటి స్టెరాయిడ్‌ రహిత నొప్పినిరోధక ఔషధాలు, కలుషిత గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల పనితీరుపై పడే ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయట. బోస్టన్‌లో 73 ఏళ్ళ సరాసరి వయసు గల 2,280 మంది ఊపిరితిత్తుల పనితీరుపై 28 రోజులు పరీక్షలు జరిపారు. దీనిలో పాల్గొన్నవారి ఆరోగ్యస్థితి, పొగతాగే అలవాటు, నొప్పినిరోధక ఔషధాల వాడకం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. అనంతరం వెల్లడైన ఫలితాల్లో ఏదైనా నొప్పినిరోధక ఔషధాలు వాడినవారిలో ఊపిరితిత్తుల పనితీరు కాస్త మెరుగ్గా ఉందట! వారిలో ఎక్కువమంది ఆస్ర్పిన్‌ వాడటంతో, ఈ ఘనత ఆస్ర్పిన్‌దే అంటున్నారు పరిశోధకులు. గాలికాలుష్యం కలిగించే హానికర ప్రభావాలను స్టెరాయిడ్‌ రహిత నొప్పినిరోధక ఔషధాలు కొంతమేరకుతప్పిస్తాయట. అయితే, కాన్సర్‌ నుండి గుండెజబ్బుల వరకు అనేక రుగ్మతలకు దారితీయగల వాయుకాలుష్యానికి గురికాకుండా ఉంటేనే మంచిదని అమెరికా శాస్ర్తజ్ఞలు సూచిస్తున్నారు.