Fashion

పండుగ ఫ్యాషన్ చిట్కాలు

Telugu Traditional Fashion Tips | Festival Fashion Looks

పండగవేళ బంధుమిత్రులందరిలోనూ తళుక్కున మెరవాలంటే.. ఆహార్యం అందంగా మలచుకోవాలి. తల నుంచి గోళ్లవరకూ ప్రతీది పక్కాగా ఉండేలా చూసుకోవాలి. అందుకు ఉపయోగపడే చిట్కాలే ఇవి.
* పండగ రోజు వేసుకునే దుస్తులు… ఎరుపు, ఆకుపచ్చ, పసుపు వంటి రంగుల మేళవింపులో ఉండేలా చూసుకోవాలి. మిరప ఎరుపు, ఆవ పసుపు, బాటిల్‌ గ్రీన్‌ వంటివి ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్న వర్ణాలు. వీటి కాంబినేషన్‌తో చీరలు, లెహెంగాలు, అనార్కలీ కుర్తీలు… ఇలాంటివేవైనా ఎంచుకోవచ్చు.
* దుస్తులకు తగ్గ యాక్సెసరీలు ఉండాల్సిందే. ఈ సందర్భానికి జ్యూతీలు బాగుంటాయి. ఫ్లాట్స్‌ ఎంచుకోవచ్చు. వీటికి అదనంగా టాజిల్స్‌, గోల్డ్‌, సిల్వర్‌ ఫ్రింజెస్‌ ఉంటే చక్కగా నప్పుతాయి.
* నగల విషయానికి వస్తే దుస్తులపై భారీ ఎంబ్రాయిడరీ ఉన్నప్పుడు మెడలో ఇతర నగలేవీ అవసరం లేదు. చెవులకు మాత్రం జుంకాలు, చాంద్‌బాలీలు తళుక్కుమనేలా చేస్తాయి. చేతులకు టెంపుల్‌ డిజైన్‌లో గాజులు వేసుకోండి. అదే ఎంబ్రాయిడరీ తక్కువగా ఉంటే…యాంటిక్‌ ఇమిటేషన్‌ జ్యూయలరీ వేసుకోవచ్చు.
* తల ముందు భాగంలో ఫ్రెంచ్‌ బ్రెయిడ్‌ స్టైల్స్‌ని వేసుకుని, వెనుక పోనీ లేదా జడ అల్లుకున్నా చాలు. తల్లో ఓ ఫ్లోరల్‌ పిన్‌ పెట్టుకుంటే మీ లుక్కే మారిపోతుంది. చివరకు గోళ్లకు మెటాలిక్‌ నెయిల్‌ పాలిష్‌ పెట్టుకుంటే చాలు.