Movies

అమలాపాల్ వెబ్‌సిరీస్

Amala Paul Starring In Web Series

ప్రస్తుతం వెబ్‌సిరీస్‌ల ట్రెండ్ నడుస్తోంది. వెండితెర దర్శకులు, నటులు కూడా వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖ స్టార్లు వెబ్‌సిరీస్‌ల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా పలు వెబ్‌సిరీస్‌లు రూపొందించారు. దక్షిణాదిలోనూ ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మొదలవుతోంది. హీరోయిన్ కియరా ఆడ్వాణీ `లస్ట్‌స్టోరీస్` వెబ్‌సిరీస్‌లో హాట్‌హాట్‌గా నటించి సూపర్ పాపులర్ అయిపోయింది. ఇప్పుడు అదే బాటలో అమలా పాల్ కూడా ఓ హాట్ వెబ్‌సిరీస్‌లో నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఘాటైన రొమాంటిక్ సీన్స్, లిప్‌లాక్ సీన్స్‌తో అమల వేడి పుట్టించనుందట. బాస్‌తో అఫైర్ పెట్టుకునే ఓ ఉద్యోగిణిగా అమల కనిపించనుందట. ఓ హిందీ వెబ్‌సిరీస్‌కు తెలుగు వెర్షన్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.