DailyDose

హెడ్మాస్టారు వెంకటరమణ హత్య కేసు ఛేధించిన పోలీసులు-నేరవార్తలు-10/09

Andhra Police Crack Kakinada Principal Venkataramana Murder Mystery-Telugu Latest Crime News Today-10/09-హెడ్మాస్టారు వెంకటరమణ హత్య కేసు ఛేధించిన పోలీసులు-నేరవార్తలు-10/09

* గురజాల పంచాయతి కార్యాలయంపై ఎసిబి దాడి. 25వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ పంచాయతి గుమస్తా కోటేశ్వరరావు. ఇంటి ప్లానింగ్ కోసం సరికొండ పూర్ణంరాజు వద్ద 40వేలు డిమాండ్ చేయగా 25వేలు కుదుర్చుకున్నారు అని ఎసిబి అడిషనల్ ఎస్పి సురేష్ బాబు తెలిపారు.

* హెడ్మాస్టారు వెంకటరమణ హత్య కేసులో నలుగురు నిందితులు అరెస్ట్‌. కాకినాడ రూరల్‌ మండలం తూరంగిలో సంచలనం సృష్టించిన‌ హెడ్మాస్టారు పట్నాల వెంకటరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. హెడ్మాస్టారు వెంకటరమణ ను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు బుధవారం ఉదయం విలేకరుల ముందు హజరుపరిచి వివరాలు వెల్లడించారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. ఏసురాజు అనే వ్యక్తి సహకారంతో వెంకటరమణ ఇంట్లో చోరీకి నిందితులు పక్కా ప్రణాళిక వేసుకున్నారని, అయితే వెంకటరావు నగలతో పాటు తన భార్యను హైదరాబాదుకు పంపించడంతో నిందితుల ప్లాన్‌ బెడిసికొట్టిందని పోలీసులు తెలిపారు. గత నెల 14న వెంకటరమణను హత్య చేసి అతని వద్ద ఉన్న రెండు వేల రూపాయల నగదు, రెండు సెల్‌ ఫోన్లను నిందితులు దొంగిలించారని తెలిపారు. మరో రెండు దొంగతనం కేసులకు సంబంధించి నిందితుల నుంచి రెండు బైకులు, రెండు బంగారు మంగళ సూత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వివరించారు.

* బెజవాడలో పెట్రేగిపోతున్న సైబర్ నేరగాళ్లు. ఏటీఎం సెంటర్లలో అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆన్ లైన్ లో డబ్బులు కొట్టేస్తున్న పెరిపే మధుసుదన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సత్యనారాయణ పురం పోలీసులు. ఏటీఎం సెంటర్లలో వెనుకవైపు ఉండి డబ్బులు డ్రా చేసే వ్యక్తి ఏటీఎం నంబర్ పసిగట్టి ,ఓటిపి ద్వారా డబ్బులు దోచుకుంటున్న వైనం. ఇప్పటి వరకు నిందితుడు మధుసుదన్ పై నమోదైన 7 కేసులు.

* గుంటూరు జిల్లాలో బాపట్ల మండలం వెదుళ్లపల్లి కొత్తపాలెం రైల్వే బిడ్జి సమీపంలో పిడిగు పడి 120 గొర్రెలు మృతి.

* ఖమ్మం రూరల్ మండలం బారుగూడెం వద్ద బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు దేవేందర్, నూతనమ్మ మృతి చెందారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి బోల్తా పడడంతో, ఈ ప్రమాదం జరిగింది. దీంతో  ఎస్ సి కాలనీలో విషాదం నెలకొంది. పోస్టుమార్టం కోసం దేవేందర్, నూతనమ్మల మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

* అన్నవరంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఓ లాడ్జ్‌లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన పవన్‌, ధనలక్ష్మిగా గుర్తించారు.

* నెల్లూరుజిల్లా చిల్లకూరు మండలంలో భూదనం సమీపంలో ఉన్న ఐ.జె.యం టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం. పక్కన లారీ ఆపి రోడ్డు దాటుతున్న డ్రైవర్ ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయిన చెన్నై నుండి నెల్లూరు వైపు వెళ్తున్న కారు. డ్రైవర్ అక్కడికక్కడే మృతి.

* అసోంలోని దిమా హసావో జిల్లాలోని కోపిలి జలవిద్యుత్ కేంద్రంలో పైపులైను పగిలిన ఘటనలో నలుగురు గల్లంతయ్యారు. మరికొందరు నీటిలో చిక్కుకుపోయారు. పైపులైను పగలడంతో పెద్ద ఎత్తున నీరు ఎగజిమ్మింది. దీంతో విద్యుత్ కేంద్రంతోపాటు చుట్టుపక్కల పరిసరాలన్నీ నీటిలో చిక్కుకుపోయాయి.

* కృష్ణా జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌పై అధికారులు కొరడా ఝులిపించారు. అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్న ప్రైవేటు బస్సులపై అధికారులు 42 కేసులు నమోదు చేశారు. ఐదు రోజులుగా గరికపాడు, పొట్టిపాడు, కీసర టోల్‌ప్లాజాల వద్ద అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో 6 బస్సులను సీజ్‌ చేసి, 295 కేసులు నమోదు చేశారు. అధిక ధరలు వసూలు చేసిన ఒక్కో బస్సుకు అధికారులు రూ.25వేల జరిమానా విధించారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు ముమ్మరం చేశామని కృష్ణా జిల్లా డీటీసీ పేర్కొన్నారు.

* ఈఎస్ఐ స్కామ్‌లో ఏసీబీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈఎస్ఐ స్కామ్‌లో నిందితులను నేడు ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో 6 గురు నిందితులను నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. రెండు రోజుల పాటు కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈరోజు, రేపు నిందితులను విచారించనుంది. వీరంతా ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో 13 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇంకా ఏసీబీ తనిఖీలు కొనసాగుతూనే ఉన్నాయి.

* ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు తనయుడు కోడెల శివరామ్‌ మంగళగిరి కోర్టుకు హాజరయ్యారు. శాసనసభ ఫర్నీచర్‌ వ్యవహారంలో పూచీకత్తు సమర్పించాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు శివరామ్‌ మంగళగిరి న్యాయస్థానానికి వచ్చారు. తనపై నమోదైన కేసులకు సంబంధించి ఇటీవల ఆయన కోర్టులో లొంగిపోయిన విషయం తెలిసిందే.