Business

జియో లేటేస్ట్ దెబ్బ-వినియోగదారుల అబ్బా!

Jio Begins To Charge Out Of Network Calls

ప్రముఖ టెలికాం కంపెనీ జియో కీలక ప్రకటన చేసింది. ఇకపై జియో నెట్‌వర్క్‌ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఆ మొత్తానికి తగిన డేటాను వినియోగదారులకు తిరిగి అందివ్వనుందని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్‌ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, జియో సొంత నెట్‌వర్క్‌ కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయబోమని ప్రకటించింది. అలాగే, ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు ఎలాంటి రుసుమూ వసూలు చేయబోమని తెలిపింది. అక్టోబర్‌ 10 నుంచి ఈ ఛార్జీలు వర్తిస్తాయని పేర్కొంది. ఇప్పటి వరకు జియో యూజర్లు కాల్స్‌కు ఎలాంటి ఛార్జీలూ చెల్లించడం లేదు. కేవలం డేటాకు మాత్రమే చెల్లించేవారు. ఈ నేపథ్యంలో ట్రాయ్‌ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ఐయూసీ ఛార్జీలను వినియోగదారుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.