Business

భారత కరెన్సీ భారీగా గుద్దుతున్న పాక్

Pakistan Printing Heavy Amounts Of Fake Indian Currency

భారత ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్రకు తెర తీసింది పాకిస్తాన్. విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా మన దేశ కరెన్సీ నోట్లను ముద్రిస్తోంది.

భారత్ లో తిష్ట వేసినట్లుగా అనుమానిస్తోన్న ఉగ్రవాదులకు ఆ నకిలీ నోట్లను చేరవేస్తోంది.

ఉగ్రవాదుల ద్వారా విస్తృతంగా వాటిని చలామణిలోకి తీసుకుని వస్తోంది. కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.

పాకిస్తాన్ లో ముద్రించిన నకిలీ నోట్లను నేపాల్, బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలోకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.

దీని వెనుక పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ఐ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

సరిహద్దుల్లో కలకలం: మళ్లీ గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్: 40 నిమిషాల పాటు చక్కర్లు

ఇప్పటికే భారత్ లోని కొన్ని ప్రధాన నగరాల్లో నివాసం ఉంటున్నట్లుగా భావిస్తున్న లష్కరేతొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థల సానుభూతిపరులకు చేరేలా నెట్ వర్క్ ను రూపొందించుకుందని,

వారి ద్వారా నకిలీ నోట్లను విస్తృతంగా చలామణిలోకి తీసుకొచ్చేలా కుట్ర పన్నినట్లు అధికారులు గుర్తించారు.

కొద్ది రోజుల కిందట బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మన దేశానికి చెందిన 2000, 500, 200 రూపాయల నోట్ల కట్లలు వెలగు చూశాయి.

అవన్నీ నకిలీవే. వాటిని పాకిస్తాన్ లో ముద్రించి, బంగ్లాదేశ్ గుండా భారత్ లోని ప్రధాన నగరాలకు చేరవేయడానికి కుట్ర పన్నినట్లు తేలింది.