DailyDose

ఏసీబీకి అడ్డంగా దొరికిన KTPS చీఫ్ ఇంజినీర్ -నేరవార్తలు-10/10

KTPS Chief Engineer Arrested For Bribery-Telugu Latest Crime News Today-10/10

* తూర్పు గోదావరి జిల్లాలో అకస్మాత్తుగా భర్త మృతి చెందడంతో మనస్తాపానికి గురై వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం వెలుగు చూసింది. మలికిపురం మండల కేంద్రంలోని మలికిపురం గ్రామానికి చెందిన రాయుడు పద్మావతి (42) భర్త పెద్దిరాజు కొన్ని నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. భర్త చనిపోయాడన్న దిగులుతో ఉన్న పద్మావతి ని రెండు నెలల క్రితం రాజమండ్రి బంధువుల ఇంటి వద్ద ఉంచారు. (నిన్న) బుధవారం రాజమండ్రి నుండి మలికిపురం వచ్చిన పద్మావతి బిల్డింగ్‌ పైకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడింది. పద్మావతికి ఒక పాప, బాబు ఉన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని రాజోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

* కడప జిల్లా వేముల మండలం యురేనియం బాధిత గ్రామమైన మబ్బుచింతలపల్లి గ్రామంలో శుద్ధి జలం గత పది రోజులుగా రాలేదంటూ ఆందోళన. యూ సి ఎల్ అధికారులను అందులో పనిచేసే కార్మికుల ను అడ్డుకున్న గ్రామస్థులు . భారీగా నిలిచిపోయిన వాహనాలు పరిస్థితి ఉద్రిక్తం.

* శ్రీకాకుళం జిల్లా కంచిలి గురుకుల పాఠశాలలో ఆరుగురు సస్పెన్షన్‌. విద్యార్థులకు పెట్టే భోజనాలు, తరగతి గదుల నిర్వహణ సరిగా లేదంటూ కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో కలిసి పాఠశాలలోనే భోజనం చేయాల్సిన ఉపాధ్యాయులు తమ ఇళ్లకు వెళ్లడంతో కలెక్టర్‌ మండిపడ్డారు. విద్యార్థులు యూనిఫాం లేకుండా ఉండటాన్ని గమనించి ప్రిన్సిపల్‌ బాలాజీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం విద్యార్థులకు కూర లేకుండా కేవలం అన్నం, పప్పుతోనే సరిపెట్టడంతో కలెక్టర్‌ మండిపడ్డారు. దీనికి బాధ్యులను చేస్తూ ప్రిన్సిపల్‌ బాలాజీ సహా ఉపాధ్యాయులు టీవీ రమణ, జయరాం, అమ్మాయమ్మ, పండి సురేశ్‌కుమార్‌, ఏకే శ్రీనివాసరావును సస్పెండ్‌ చేశారు.

* విజయవాడ ఆయుష్ ఆసుపత్రి వద్ద వ్యక్తి మృతి. ఆయుష్ ఆసుపత్రికి టెస్టులు చేయించుకోవటం వచ్చిన గోపికృష్ణ. గోపికృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి. సెక్షన్ 174కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

* ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం. పాల్వంచ – కొత్తగూడెంలోని కెటిపిఎస్ లో ఓ అవినీతి తిమింగలం ఏసీబీకి చిక్కింది. కెటిపిఎస్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆనందం అనే అధికారి ఏకంగా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.