NRI-NRT

కాలిఫోర్నియాలో గాంధీ 150వ జయంతి.పాల్గొన్న మండలి.

Mandali Buddhaprasad Attend Gandhijis 150th Birth Anniversary In California

మహాత్ముడి 150వ జయంతిని పురస్కరించుకుని కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో గల సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవాన్ని Cities For Peace, Art Of Living సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్వహించాయి. ఏపీ మాజీ ఉప-సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీజి జీవన విధానం నేటి, ఏనాటికీ ప్రపంచ శాంతికి మార్గదర్శకాలని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సభ్యులు కెన్సన్ చూ, భారత కాన్సులేట్ అధికారి సుమతీరావు తదితరులు ప్రసంగించారు.