Movies

చెమట పడింది

Parineeti Chopra Sweating For Saina Nehwals Biopic

పాటల్లో హీరోతో కలిసి సరదాగా ఓ నాలుగు స్టెప్పులు వేసేసి, ఓ ఆరు సీన్లు చేసే గ్లామర్‌ పాత్రలు పోషించడం హీరోయిన్‌లకు పెద్ద విషయం ఏమీ కాదు. అప్పుడప్పుడు మాత్రమే సవాల్‌ విసిరే పాత్రలు వస్తుంటాయి. అలాంటప్పుడే సత్తా చాటాలి. ఎంతటి కష్టానికైనా సిద్ధపడాల్సిందే. ప్రస్తుతం అదే పనిలో తలమునకలై ఉంది బాలీవుడ్‌ నాయిక పరిణీతి చోప్రా. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ జీవిత కథ వెండితెరకొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సైనా నెహ్వాల్‌గా పరిణీతి నటిస్తోంది. ఓ క్రీడాకారిణిగా తెరపై కనిపించడం అంటే అంత సులువేం కాదు. ఆటను నేర్చుకోవాలి. ఫిట్‌నెస్‌గానూ కనిపించాలి. కొన్ని నెలల కిందటే పరిణీతి బ్యాడ్మింటన్‌ సాధన మొదలుపెట్టేసింది. సైనాగా ప్రేక్షకుల్ని మెప్పించడానికి చెమటోడుస్తుంది పరిణీతి. ఈ సినిమా త్వరలో మొదలుకాబోతుందంటూ బ్యాడ్మింటన్‌ కోర్టులో ఉన్న తన ఫొటోను పంచుకుంది పరిణీతి. అమోల్‌ గుప్తా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి భూషణ్‌ కుమార్‌ నిర్మాత.