Movies

కరుణ ప్రకాశం

Prakash Raj To Star As Karunanidhi In His Biopic

జయలలిత జీవిత కథ ఆధారంగా దర్శకుడు ఏఎల్‌ విజయ్‌ ‘తలైవి’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో జయలలితగా కంగనా రనౌత్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రకు సంబంధించి ఇటీవల మోల్డ్‌ కూడా తీశారు. జయలలిత పాత్రలో పరకాయం ప్రవేశం చేసే దిశగా శిక్షణ పొందుతోంది కంగనా. ఇక ఎంజీఆర్‌ పాత్రలో అరవింద్‌స్వామి నటించనున్నట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. గతంలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇరువర్‌’ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ నటించారు. ఇది ఎంజీఆర్‌, కరుణానిధిల కథ అని ప్రేక్షకులు చెబుతుండగా.. చిత్రవర్గాలు మాత్రం అధికారికంగా ప్రకటించ లేదు. అందులో కరుణానిధి పాత్రలోనే ప్రకాశ్‌రాజ్‌ కనిపించారు. ఈ నేపథ్యంలో 22 సంవత్సరాల తర్వాత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్‌ నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.