Politics

తెలంగాణాలో ప్లాస్టిక్ నిషేధం

Telangana Government Bans Plastic

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కార్యక్రమంపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ప్రగతిభవన్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పర్యావరణంపై చర్చ సందర్భంగా మానవాళికి, జీవకోటికి ముప్పుగా మారుతున్న ప్లాస్టిక్‌ను నిషేధించాలని సీఎం నిర్ణయించారు. దీనికి అవసరమైన విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రివర్గ భేటీలో ప్లాస్టిక్‌ నిషేధంపై చర్చించి ఉత్తర్వులు జారీ చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో కేంద్రం నుంచి అవార్డులు అందుకున్న జిల్లా కలెక్టర్లను సీఎం అభినందించారు. పెద్దపల్లి కలెక్టర్‌ దేవసేన, సంగారెడ్డి కలెక్టర్‌ హన్మంతరావు, భూపాలపల్లి కలెక్టర్‌ వెంకటేశ్వర్లుకు కేసీఆర్‌ అభినందనలు తెలిపారు.