Agriculture

నీటి పంపకాలపై ఏపీ తెలంగాణా అధికారుల భేటీ

Telugu Agricultural News | Officials Meet To Discuss Water Shares Between Telugu States

నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణ ఇంజినీర్ల సమావేశం అయ్యారు.

పోతిరెడ్డిపాడు, కేసీ కెనాల్, ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్, కేడీఎస్‌ నుంచి.. కేటాయింపుల కంటే ఎక్కువ నీటిని వాడుకున్నారని తెలంగాణ వాదించింది.

ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్ మినహా మిగతా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ వాదనతో ఏపీ ఇరిగేషన్ అధికారులు ఏకీభవించారు.

ఈ నెల 15న ఈఎన్‌సీల సమావేశంలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నారు.

నవంబర్ వరకు 150 టీఎంసీల నీరు విడుదల చేయాలని ఏపీ కోరింది.

అలాగే 79 టీఎంసీల నీరు విడుదల చేయాలని తెలంగాణ కోరింది.

రేపు నీటి కేటాయింపులపై రిలీజ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.