Fashion

సాదా జకెట్లకు టాటా. ఫ్లోరల్ ప్రింట్లకు ఎర్రతివాచీ బాట.

Telugu Fashion Trends - 3D Blouse Designs | Floral Blouse Designs

చీర మీదకు ఏదో ఒక బ్లవుజు కుట్టించుకోవడం అనేది నిన్నటిమాట. చీరలకు తగినట్లుగా వాటి డిజైన్లూ మారిపోతున్నాయి. త్రీడీ ఎంబ్రాయిడరీ మొదలు.. మరెన్నో కొత్త రకాలు ఇప్పుడు మెప్పిస్తున్నాయి. అవేంటీ.. వాటి ప్రత్యేకతలేంటో చూద్దామా…

Image result for 3d blouse

బ్రాసో ఎంబ్రాయిడరీ…
జియోమెట్రిక్‌, ఫ్లోరల్‌ ప్రింట్లలో ఎక్కువగా ఈ బ్రాసో ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది. ఈ బ్లవుజులు యువతకే కాదు… వయసులో పెద్దవారికీ బాగుంటాయి. ఫ్యాన్సీ చీరల మీదకు చక్కని ఎంపిక.

Image result for 3d blouse

* మెరుపుల చీలికలు(ఫ్రింజెస్‌)…
అరబ్‌నైట్‌ సిరీస్‌ నుంచి స్ఫూర్తి పొంది చేసిన బ్లవుజు డిజైను ఇది. దీన్ని షీర్‌ఫ్యాబ్రిక్‌, షిమ్మర్‌జార్జెట్‌తో డిజైను చేయించుకోవచ్ఛు ఈ బ్లవుజులు టీనేజీ అమ్మాయిలకు పార్టీవేర్‌గా బాగుంటాయి. సిల్వర్‌, గోల్డ్‌ ఫ్రింజెస్‌ కళగా అనిపిస్తాయి. ఆసక్తిని బట్టి బోట్‌నెక్‌, ఫుల్‌బ్లవుజ్‌, స్లీవ్‌లెస్‌ వంటి డిజైన్‌లతో ప్రయత్నించొచ్ఛు ఇవి సంగీత్‌, రిసెప్షన్‌ వంటి వేడుకలకు బాగుంటాయి. లైట్‌ షిఫాన్‌ చీరలమీదకు అదుర్స్‌ అనిపిస్తాయి.

Related image

* త్రీడీ ఎంబ్రాయిడరీ…
పూలు, పక్షులు… ఇతరత్రా డిజైన్లు ఏవైనా సరే! దుస్తులపై ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది ఈ త్రీడీ ఎంబ్రాయిడరీ. పుట్టినరోజు వేడుకలు, రిసెప్షన్లు, కాలేజీ పార్టీలు… వేటిమీదకైనా వీటిదే హవా. లెహెంగాలు, నెట్‌ చీరల మీదకు బాగుంటాయి. దీన్నే పఫ్‌ ఎంబ్రాయిడరీ అనీ అంటారు.

Related image

* ఫ్లోరల్‌ ప్రింట్లు…
ఏ వయసువారినైనా మెప్పిస్తాయివి. కాటన్‌ చీరల మీదకు ఎంచుకుంటే ఆఫీసులకు హుందాగా ఉంటాయి. కాస్త డిజైనర్‌ లుక్‌తో ప్యాటర్న్‌ని ప్రయత్నిస్తే పార్టీవేర్‌గానూ బాగుంటాయి. మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌లానూ ఎంచుకోవచ్ఛు ఆంగ్ల యూ నెక్‌, బోట్‌నెక్‌లో ఈ తరహా ప్రయత్నించొచ్ఛు.

Image result for 3d blouse

* ప్లెయిన్‌ పార్టీ స్టైల్‌…
సాదా లుక్‌లో బ్లవుజులేం బాగుంటాయి అంటారు చాలామంది. పొడవాటి చేతులు, హైనెక్‌, బోట్‌నెక్‌, పఫ్‌స్లీవ్స్‌, పెప్లమ్‌ స్టైల్స్‌లో ప్రయత్నించొచ్ఛు ఆడంబరంగా ఉండే పట్టు చీరల రకాలకు ఇవి అదిరిపోతాయి.