Food

దరిద్రపు దుర్వాసనలు పోవాలంటే దాల్చినచెక్క

Telugu Food Tips & Tricks | Cinnamon For Bad Breath And Odor Removals

ఇంట్లో సహజసిద్ధమైన సువాసనలు వెదజల్లేలా చేసుకుంటే … ఆ సువాసనకు మానసిక ఆరోగ్యమూ సొంతమవుతుందని అంటున్నారు నిపుణులు.

* ఓ గిన్నెలో కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై వేడి చేయాలి. అవి మరుగుతున్నప్పుడు కొన్ని నారింజ తొనలు, చెంచా దాల్చిన చెక్క పొడి, రెండు లవంగాలు వేసి పొయ్యి కట్టేయాలి. ఈ మిశ్రమాన్ని గదిలో ఓ మూల ఉంచితే… ఇల్లంతా పరిమళభరితం అవుతుంది. ●
* ఓ గిన్నె నిండా నీరు తీసుకుని అందులో కొన్ని చుక్కల అరోమా నూనె వేసి గదిలో ఓ మూల ఉంచాలి. ఆ పరిమళం సాయంత్రం వరకు ఉంటుంది. చిన్న స్ప్రే సీసాలో నీటిని నింపి, అందులో కొద్దిగా వంట సోడా, రెండు లేదా మూడు చుక్కల ఈ నూనె వేసి బాగా కలపాలి. దాన్ని సోఫా, పరదాలు, గది మూలల్లో చల్లినా చాలు. ఇల్లంతా సువాసనతో నిండిపోతుంది.
* తివాచీ లేదా గదులను శుభ్రపరిచే సమయంలోనే సువాసనలు వెదజల్లేలా చేసుకోవచ్ఛు అరకప్పు చొప్పున బొరాక్స్‌, వంటసోడాకు 30 చుక్కల స్వీట్‌ ఆరెంజ్‌ ఎస్సెన్షియల్‌ ఆయిల్‌, చెంచా దాల్చిన చెక్క లేదా లవంగాల పొడిని కలపాలి. దీన్ని గదులను తుడిచే నీటిలో వేస్తే చాలు. ఇల్లు శుభ్రపడటమే కాదు, మంచి వాసనా వస్తుంది. కార్పెట్‌ను శుభ్రపరిచేటప్పుడూ ఈ పౌడర్‌ను దానిపై చల్లి తరువాత దులిపేయాలి. ఏదైనా దుర్వాసన ఉన్నా పోతుంది.
* తాజా గులాబీలు, లిల్లీలున్న ఫ్లవర్‌వాజును భోజనాల బల్ల మధ్యలో ఉంచి చూడండి. ఇల్లంతా సహజసిద్ధమైన పరిమళంతో నిండిపోతుంది.