NRI-NRT

కాన్సాస్‌లో TAGKC దసరా వేడుకలు

TNILIVE Kansas USA Telugu News | TAGKC Dasara 2019-కాన్సాస్‌లో TAGKC దసరా వేడుకలు

గ్రేటర్‌ కాన్సాస్‌ తెలుగు సంఘం ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. స్థానిక హిందూ దేవాలయంలో ఈ వేడుకలను వైభవంగా జరిపారు. అర్చకులు శ్రీనివాస చార్యులు పర్యవేక్షణలో గౌరీ పూజలో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయపద్ధతిలో ఎంతో వైభవంగా దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. మహిళలు, చిన్నారులు, పిల్లలు, పెద్దలు అందరూ సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకల్లో పాల్గొని సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమానికి అదితి బావరాజు, శ్రీకాంత్‌ లంక వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. పలు విభాగాల్లో పోటీలో పాల్గొని విజేతలుగా నిలిచినవారికి బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సంప్రదాయ పద్ధతిలో బతుకమ్మలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ గ్రేటర్‌ కాన్సాస్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు శివ తీయగూర కృతజ్ఞతలు తెలిపారు.
TNILIVE Kansas USA Telugu News | TAGKC Dasara 2019-కాన్సాస్‌లో TAGKC దసరా వేడుకలు