NRI-NRT

డీసీలో వైభవంగా TDF బతుకమ్మ వేడుకలు

tnilive-washington-dc-usa-telugu-news-telangana-development-forum-tdf-2019-bathukamma-huge-success

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో ఆదివారం నాడు టీడీఫ్ ఆధ్వర్యంలో బతుకమ్మ నిర్వహించారు. వేలసంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆడుతూ పాడుతూ సద్దుల బతుకమ్మను కొలిచారు. సీమాంధ్ర ఆడపడుచులు, అమెరికాలో పుట్టిపెరిగిన ప్రవాస యువతీయువకులు, బాలబాలికలు కూడా ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. సంస్థ అధ్యక్షురాలు చల్లా కవిత సభికులకు బతుకమ్మ శుభాకామ్కలు తెలిపారు. నవంబర్ 8,9 తేదీల్లో డీసీలో TDF 20వ వార్షికోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మంజువాణి, కల్పనా బృందం బతుకమ్మ మెడ్లీ నాట్యం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో టీడీఫ్ ఉపాధ్యక్షుడు రవి పళ్ళ, ట్రస్టీ శ్రీకాంత్ ఆరుట్ల, బతుకమ్మ కన్వీనర్ రాంమోహన్ సూరనేని, మాజీ ఉపాధ్యక్షుడు అమరేందర్ రెడ్డి బొజ్జ , మాజీ అధ్యక్షులు మరియు ట్రస్టీలు, కోఆర్డినేటర్లు సుధీర్ బండారు, కౌశిక్ సామ, నవీన్ చల్ల, మల్లారెడ్డి, కల్పనా బోయినపల్లి, నవీన్ రంగ, అనిల్ కేశినేని, కిరణ్ జాలా, జీనత్ కుందురు, హర్ష రెడ్డి, అనిల్ బోయినపల్లి, క్రాంతి పళ్ళ, వినీత్ లోకా, సుజిత్ మారం, అమర్ అతికం, లోహిత్, నరేందర్ చల్ల, రఘువీర్ రెడ్డి, జయా తెలుకుంటల, మహేష్ రావు, కిషోర్ ఏళ్ల, శశాంక్ తదితరులు పాల్గొన్నారు. ఈశ్వర్ బండా, అవంతికా నక్షత్రం, రాజశేఖర్ బసవరాజు తదితరులు సహకరించారు.