Movies

రంగీలాకి నివాళి

Tribute To Rangeela To Come Soon

సూరి, నైనా జంటగా నటించిన చిత్రం ‘బ్యూటిఫుల్‌’. ట్రిబ్యూట్‌ టు రంగీలా అనేది ఉపశీర్షిక. అగస్త్య మంజు దర్శకుడు. టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌పై టి.నరేష్‌కుమార్‌, శ్రీధర్లతో కలిసి రాంగోపాల్‌ వర్మ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. బుధవారం ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘రాంగోపాల్‌ వర్మతో కలిసి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ దర్శకత్వం వహించిన అగస్త్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆయన వర్మ స్టైల్‌లోనే ఈ సినిమా తీశారు. వర్మ చిత్రాల్లో ‘రంగీలా’కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ‘ట్రిబ్యూట్‌ టూ రంగీలా’ అని చెప్పడానికి కారణం ఏంటో సినిమా చూశాక అర్థం అవుతుంద’’ని నిర్మాతలు తెలిపారు. సంగీతం: రవిశంకర్‌.